టీవీ షోకు హాజరైన ఓ యువకుడు బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్ ను చెంపపై కొట్టిన ఘటన
కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి ఓ టీవీ షోకు హాజరైన గౌహర్ ఖాన్
షూటింగ్ లో ఉన్న సమయంలో అకిల్ మాలిక్(24) అమాంతం స్టేజ్ పైకి వెళ్లాడు.
అంతటితో ఆగకుండా ఆమెను తాకేందుకు యత్నించాడు. ఆ క్రమంలోనే అతను ఆమెపై చేయి
చేసుకున్నాడు. అసలు ఈ షోకు కురచ దుస్తుల్లో ఎందుకొచ్చావంటూ ఆమెను
ప్రశ్నించాడు. దీంతో అప్రమత్తమైన అక్కడి సిబ్బంది అతన్ని అక్కడి నుంచి
తీసుకొచ్చి పోలీసులకు అప్పజెప్పారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లైంగిక వేధింపుల చట్టం కింద కేసు
నమోదు చేసే పనిలో ఉన్నారు. గత మూడు -నాలుగు రోజుల నుంచి ఆడియన్స్ లో
సభ్యుడిగా ఉన్న మాలిక్ ఆ షోలో నటిపట్ల ప్రవర్తించాడని ఓ పోలీస్ అధికారి
తెలిపాడు. అతను హీరోయిన్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో మద్యం సేవించి
ఉన్నాడా?అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని, అందుకోసం అతన్ని వైద్య పరీక్షలకు
పంపినట్లు పోలీసులు తెలిపారు.