దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ మహేష్ ల డ్రస్సింగ్ సెన్స్ పై చేసిన కామెంట్లు చాల ఆ శక్తి దాయకంగా మారాయి. నిన్న జరిగిన ‘మేము సైతం’ ప్రోగ్రాంలో మహేష్ త్రివిక్రమ్ లతో సమంత చేసిన రికార్డెడ్ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ మహేష్ పవన్ లను పోలుస్తూ కొన్ని ఆ శక్తికర విషయాలను తెలియచేసాడు. టాప్ హీరోలుగా వీరిద్దరూ ఎదిగిపోయినా నిరాడంబరత విషయంలో వీరిద్దరి ప్రవర్తన ఒకేలా ఉంటుందని ఒక ఆ శక్తికర విషయం చెప్పాడు. వీరిద్దరు అవుట్ డోర్ షూటింగ్ కు వస్తున్నప్పుడు అతి తక్కువ లగేజ్ తో ముఖ్యంగా చాలా సాదా సీదాగా వీరిద్దరికి 2 ఫ్యాంట్లు, 2 చొక్కాలు ఉంటే చాలనుకుని షూటింగ్ స్పాట్ కు వచ్చేస్తు ఉంటారని అంటూ ఖరీదైన కారుల పట్ల అలాగే విలాస వంతమైన జీవితం పట్ల పెద్దగా మోజు పడరని కామెంట్ చేసాడు త్రివిక్రమ్.  అయితే వీరిద్దరూ ఎక్కడ ఉన్నా అత్యంత ఖరీదైన హోటల్ రూమ్స్ అడగరు కాని వరస పేట్టి చూడడానికి సినిమాల సీడీలు, మంచి మంచి పుస్తకాలు మాత్రం అడుగుతూ ఉంటారని చెపుతూ వీరిద్దరూ తరుచు కలుసుకుంటూ ఉండకపోయినా వీరి ఆలోచనలు భావాలు మాత్రం ఒకటే అంటూ పవన్, మహేష్ లలోని సారుప్యాన్ని తెలియచేసాడు త్రివిక్రమ్.  ఇంత సన్నిహితంగా వీరిద్దరిని చూసాడు కాబట్టే వీరిద్దరితో ఎక్కువ సినిమాలు చేసే అవకాశం త్రివిక్రమ్ పొందాడు అనుకోవాలి.
 
Top