సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ కి ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ ఉండదు. టోటల్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ రజనీకాంత్ గురించి గొప్పలు చెప్పాల్సిందే. ఎందుకంటే తను సాధించుకున్న ఆ స్టార్ డం అలాంటిది మరి. ముఖ్యంగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లో అయితే రజనీకాంత్ కి వీర ఫాలోయింగ్ ఉంది. రజనీకాంత్ ప్రమోషన్ చేసిన మూవీకి బాక్సాపీస్ రికార్డ్స్ ఖాయం అన్నట్టుగా ఉంటుంది. అలాగే ఈ తరహా క్రేజ్ రాజకీయాలలోనూ రజనీకాంత్ పై ఉంది. రజనీకాంత్ ఏ రాజకీయ పార్టికి యస్ అంటే, ఆ పార్టీ కళ్ళు మూసుకొని అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది అక్కడ. అయితే రజనీకాంత్ రాజకీయాల గురించి ఏనాడు ఆలోచించలేదు. కానీ ఈ మధ్య రజనీకాంత్ స్వయంగా తనకు రాజకీయాలపై ఉన్న అభప్రాయం ఏంటో చెప్పుకొచ్చాడు. "రాజకీయాలు కొత్త కాదు, అలా అని భయమూ కాదు. నేను రాలేక కాదు. రావాలనుకోక రావడంలేదు" అంటూ తనదైన శైలిలో చెప్పాడు. దీంతో ఆయన్ను రాజకీయాల్లోకి రాకుండా ముందుగానే అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా స్టార్ యాక్టర్ ఖుష్భు రజనీకాంత్ పై సెటైర్స్ వేసింది. అలాగే రీసెంట్ గా తమిళ దర్శకుడు, నటుడు అయిన సీమాన్ నాన్ తమిళర్ కట్చి' పార్టీలో కొనసాగుతున్న సీమాన్ ఆ పార్టీ సభలో మాట్లాడుతూ తమిళుల కోసం తమ పార్టీ ఆవిర్భవించిందని, తమిళ జాతి మనుగడ, సంక్షేమం పార్టీ ముఖ్య లక్ష్యం అన్నారు. తమిళ జాతి కోసం ప్రాణాలు అర్పించిన ఎల్టీటీఈ నేత ప్రభాకరణ్ ఆరాధ్యుడు' అని వ్యాఖ్యనించారు. ‘తమిళుడు కాని రజనీకాంత్ లాంటి వారిని రాజకీయాల్లోకి ఆహ్వానించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన తన జీవిత కాలంలో తమిళుల కోసం ఏం చేసారని ప్రశ్నించాడు. తమిళుడే ఈ గడ్డను ఏలాలి. ఒక వేళ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తొలి ప్రత్యర్థి తానే అన్నారు. ‘ఒంటరిగా వస్తావా మద్దతుగా వస్తావా తేల్చుకుందాం రా' అంటూ సీమాన్ సవాల్ విసరడం చర్చనీయాంశం అయింది. మొత్తంగాఈ గొడవ చివరకి ఎలా ముగుస్తుందో ఆసక్తిగా మారింది.
 
Top