టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా త్వరలో ప్రారంభం కాబోతున్న అఖిల్ సినిమా గురించి సంబందించిన వార్తల హడావిడితో వేడెక్కి పోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా ఈ సినిమాకు సంభందించిన ఏదో ఒక గాసిప్ న్యూస్ లు లేకుండా రోజు గడవడంలేదు.  ఇప్పటికే ఈ సినిమాకు వినాయక్ దర్శకత్వం వహిస్తాడని ఖచ్చితమైన వార్తలు రావడంతో ఈ సినిమా కధకు సంబంధించి అలేగే ఈ సినిమాలో అఖిల్ పక్కన నటించబోయే హీరోయిన్స్ గురించి ఇప్పటివరకు అనేక వార్తలు వచ్చాయి. అయితే దీనికి కొనసాగింపుగా గత రెండురోజుల నుండి ఈ సినిమా లో సమంత ఒక ప్రత్యేక పాత్రలో కనిపించ బోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి.  అక్కినేని కుటుంబానికి సమoతకు ఉన్న సానిహిత్యంతో పాటు అక్కినే కుటుంబానికి అదృష్ట లక్ష్మిగా మారిన నేపధ్యంలో నాగార్జున సమoతను అఖిల్ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటించమన్నాడని టాక్. సమంతా కూడా నాగార్జున కోరికను మన్నించడంతో ఇప్పటి వరకు అనుకున్న కధలో సమoతకు ఒక ప్రత్యేక పాత్రను క్రియేట్ చేసే పనిలో దర్శకుడు వినాయక్ ఈ కధకు సంభందించి కొన్ని మార్పులు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే అఖిల్ సినిమాలో మరో సంచలనం చూడబోతున్నాం అనుకోవాలి. ఈ విషయమై మరికొద్ది రోజులలలో క్లారిటీ వస్తుందని టాక్..
 
Top