బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు అన్నట్టు అనుష్కలాంటి బ్యూటీని చూస్తే కుర్రకారుకు మనసు లాగేస్తుంది. అదే విధంగా మంచి శరీర దారుఢ్యం కలిగిన యువకులు హీరోయిన్లను తమ బుట్టలో వేసుకుంటుంటారు. అలా వారిమోహంలో పడి పిచ్చిపిచ్చిగా ప్రేమించిన హీరోయిన్లు లేకపోలేదు. నటుడు ఆర్య విషయానికే వస్తే ఆయనకు హీరోయిన్ల హీరో అనే పేరొంది. అలాగే ఆర్య బిరియానితో హీరోయిన్లను ఆకర్షిస్తారనే ప్రచారం కూడా ఉంది. తనతో నటించిన హీరోయిన్లందరితోనూ ఆర్య చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తాడని కూడా అంటుంటారు. అలా నయనతార, త్రిష, ఎమి జాక్సన్, హన్సిక వంటి హీరోయిన్లందరితో ఆర్యను కలుపుతూ పలు వదంతులు ప్రచారం అయ్యాయి. నటి అనుష్క పేరు ఆర్య నాయకి పట్టికలో ఒకటిగా వదంతులు దొర్లాయి. ఈ భామ ఆర్య సరసన ఇరండాం ఉలగం చిత్రంలో నటించారు. దీంతో ఆర్య అనుష్కల గురించి రకరకాల ప్రచారం జరిగింది. అదే విధంగా అనుష్కకు ఒక టాలీవుడ్ యువ నటుడితో లవ్ అంటు వదంతులు వచ్చాయి. అలాంటి సమయంలో ఆర్య నిర్మించిన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి నయనతార, త్రిషతోపాటు అనుష్కను అతిథిగా ఆహ్వానించారు. అప్పటికే ఆర్యతో వదంతుల్లో చిక్కుకున్న అనుష్క వాటికి మరింత బలం చేకూర్చడం ఇష్టం లేక ఆ కార్యక్రమానికి గైర్హాజరై తప్పించుకున్నారు. ఇటీవల ఓ టాలీవుడ్ యువ నటుడు అనుష్కను బుట్టలో పడేయాలన్న ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ వెంటనే అలాగా... అన్నయ్యా... అంటూ పిలిచి ఆ నటుడికి యమ షాక్ ఇచ్చారట. అలాంటి తెలివిని ప్రదర్శించిన అనుష్క తీరును మెచ్చుకోకుండా ఉండలేని సినీ వర్గాలు దటీజ్ అనుష్క అంటున్నాయి.
 
Top