డిసెంబర్ మొదలు కావడంతో అనుష్క హవా కూడా మొదలైంది. ఈ నెల 12న ‘లింగ’ విడుదల అవుతుంటే వచ్చే నెల రేస్ లో ‘రాణి రుద్రమ’ రెడీగా ఉంది. ఇలా అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ సినిమాల హీరోయిన్ గా టాలీవుడ్ ను షేక్ చేస్తున్న అనుష్క ఈ మధ్య ఒక యంగ్ టాలీవుడ్ హీరోను అన్నయ్యా అని పిలిచి ఆ హీరోకి షాక్ ఇచ్చింది అనే వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ గా టాప్ రేంజ్ లో కొనసాగుతున్న అనుష్క ప్రేమ వ్యవహారం గురించి, పెళ్ళి గురించి తరుచు మీడియాలో గాసిప్పులు రావడం సర్వ సాధారణంగా మారిపోయింది. కొద్ది నెలల క్రితం కోలీవుడ్ యంగ్ హీరో ఆర్యాతో అనుష్క ప్రేమ వ్యవహారం నడుపుతోందని అంటూ ఆమె పై కోలీవుడ్ మీడియా విపరీతంగా గాసిప్పులు రాసింది. తనతో నటించిన హీరోయిన్లందరితోనూ చెట్టాపట్టాలేసుకుని ఆర్యా లేటెస్ట్ ప్రేయసిగా అనుష్క మారిపోయింది అని వదంతులు రావడంతో ఆ గాసిప్పులకు చెక్ పెట్టడానికి, గతంలో ఆర్యా తాను సొంతంగా నిర్మించిన సినిమా ఆడియో ఫంక్షన్ కు నయనతార, త్రిషలతో పాటు అనుష్కను కూడా ఆహ్వానించినా తాను ఆ ఆడియో ఫంక్షన్ కు వెళ్ళకుండా ఆర్యాకు గతంలో అనుకోని షాక్ ఇచ్చింది అనుష్క.  అయితే ఈ విషయం జరిగిపోయి కొన్ని నెలలు గడిచిన తరువాత ఈమధ్య అనుష్కను ఒక టాలీవుడ్ యంగ్ హీరో బుట్టలో పడేయాలని ప్రయత్నిస్తున్నాడు అంటూ ఈమధ్య తెగ గాసిప్పులు వచ్చాయి. అయితే ఈ వార్తలు అనుష్క దాకా వచ్చాయి కాబోలు ఈ మధ్య జరిగిన ఒక ఫంక్షన్ లో అనుష్క ఆ యువ హీరోను అన్నయ్యా అంటూ పిలిచి ఆ నటుడికి షాక్ ఇచ్చింది అంటూ ఈరోజు ఒక ప్రముఖ పత్రిక కధనం.  ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా అనుష్క చేత అన్నయ్యా అని పిలిపించుకున్న యంగ్ హీరో ఎవరూ? అన్నది సస్పెన్స్ గా మారింది..
 
Top