టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కావాల్సింది ఏమిటో, సరిగ్గా దానినే ఇస్తుంది స్టార్ హీరోయిన్ రెజీనా. ప్రస్తుతం రెజీనా అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు. యాక్టింగ్ కి స్కోప్ వున్న పాత్రలని కూడ రెజీనా చాలా ఈజీగా చేస్తుంది. దీంతో రెజీనా అంటే ఇష్టపడే హీరోలు, దర్శకులు ఉన్నారు. వీరితో పాటు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.
పెద్ద చిత్రాలలోనూ అందరి హీరోలకి సరిపోయే ఫిజిక్ రెజీనాది. ప్రస్తుతం సమంత లాంటి హీరోయిన్స్ కి కోట్ల రూపాయలను ఇచ్చే బదులు, రెజీనా లాంటి హీరోయిన్ ని పెట్టుకుంటే 50 లక్షల లోపే ప్యాకేజ్ ని ముగించవచ్చు అంటూ నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అందుకే రెజీనా తన మనసులోని మాటలను బయటకు చెప్పుకుంది.
తనకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తోనూ, ప్రిన్స్ మహేశ్ బాబుతోనూ స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని రిసెంట్ గా ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది. వీరిద్దరి సరసనా కనువిందు చేసే ఏ చిన్న అవకాశం లభించినా విడిచిపెట్టేందుకు అమ్మడు సిద్ధంగా లేదట. ఏమైనా.... అందం, అభినయం ఉన్న హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కాబట్టి, రెజీనా కోరికను తీర్చే పనిలో ఉన్నారు కొందరు దర్శకులు.
త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన రెజీనా నటించే అవకాశం ఉందని అంటున్నారు. తనకి ఆఫర్స్ ఎక్కువుగా వస్తున్న కారణంగా ఒకేసారి రెమ్యునరేషన్ ని డబుల్ చేసే ఉద్ధేశం కూడ లేదని అంటుంది. సమయం చూసి రెమ్యునరేషన్ ని పెంచుకుంటాను, అదీనూ నిర్మాతలకు పెద్దగా ఇబ్బంది లేకుండానే అని తెలివిగా జవాబు ఇస్తుంది. ఇదిలా ఉంటే అందరి సౌత్ హీరోయిన్స్ లాగే, రెజీనా కూడ బిటౌన్ లో ఆఫర్స కోసం ఎదురుచూస్తున్నట్టు తాజాగా టాక్స్ వినిపిస్తున్నాయి.
 
Top