హీరోయిన్స్ ప్రేమ వ్యవహారాలు, సహజీవనాలు గురించి వార్తలు వ్రాసే బాలీవుడ్
మీడియా విచిత్రమైన దీపిక క్యాండిల్ సీక్రెట్ ను బయట పెట్టింది. ప్రస్తుతం
బాలీవుడ్ ను గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా ఏలుతున్న దీపిక పదుకొనేకు ‘అరోమా
ధేరపి’ క్యాండిల్స్ అంటే మహా మోజు.
మంచి సువాసనలను వెదజల్లే ఈ క్యాండిల్స్ వెలుగును తధేకంగా ఏ వ్యక్తి అయినా
చూస్తే ఆ వ్యక్తి మనసుకు ప్రశాంతత కలగడమే కాకుండా ముఖంలో మంచి ఆకర్షణ
ఏర్పడుతుందని ఈ ‘అరోమా ధెరపీ’ క్యాండిల్స్ ను ప్రమోట్ చేసే కంపెనీలు చెపుతూ
ఉంటాయి.
ఈ మాటలు బాగా నచ్చిన దీపిక ప్రస్తుతం తాను ఎక్కాకు వెళ్ళినా తన కూడ ఈ
క్యాండిల్స్ కట్టలను తీసుకు వెళుతోందట. అంతేకాదు ఆమె హ్యాండ్ బ్యాగ్ లో కూడ
ఈ క్యాండిల్స్ కనిపిస్తూ ఉండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
ఆఖరికి షూటింగ్ స్పాట్ దగ్గర దీపిక రెస్ట్ తీసుకునే వ్యానిటీ వ్యాన్ లో కూడ
ఈ క్యాండిల్స్ పెట్టుకుని షూటింగ్ బ్రేక్ మధ్య వ్యాన్ లోని లైట్స్ అన్నీ
ఆర్పివేసి ఈ కొవ్వొత్తుల సుఘంధ పరిమళాన్ని ఆస్వాదిస్తూ తన అందమైన ముఖ
కాంతిని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు
వ్రాస్తోంది. అలియా భట్ లాంటి కొత్త హీరోయిన్స్ పోటీకి భయపడి దీపిక ఈ
కొవ్వొత్తుల మ్యాజిక్ ను నమ్ముకుంది కాబోలు.