టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టైల్ ని క్రియేట్ చేసుకున్న హీరో కం కమెడియన్ సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు తన మొదటి ఫిల్మ్ హృదయ కాలేయంతోనే టాలీవుడ్ లో స్టార్ డం ని సంపాందించుకున్నాడు. తను తీస్తున్న మూవీ కామెడీ అయినప్పటికీ, తన పేరేతోనే మూవీకి క్రేజ్ తెచ్చుకోగల ఘనుడు ఈ సంపూర్ణేష్ బాబు. ఫ్యామిలీ ఆడియన్స్ సంపూర్ణేష్ ని ఆదరించకపోయినప్పటికీ, యూత్ మాత్రం సంపూర్ణేష్ చేసే ఎంటర్టైన్మెంట్ కి ఫిదా అవుతుంది. తను చేసే కుళ్ళు కామెడీని జోకులతో చెప్పుకుంటూ తెగ నవ్వుకుంటున్నారు. మొత్తానికి సంపూర్ణేష్ బాబుని యూత్ ఆదిరిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు నటించినబోతున్న అప్ కమింగ్ మూవీలో నటుల కొరత ఏర్పడింది. తన రెండో మూవీలో స్టార్ కాస్టింగ్ ని పెడతామని విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటకీ చాలా మంది నటులు, సంపూర్ణేష్ సరసన నటించటానికి ఇష్టపడటం లేదు. దీంతో చిత్ర బృందం సంపూర్ణేష్ సరసన నటించే ఆసక్తి గల కొత్త నటులకు ఆహ్వానం పలికింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సెలక్షన్స్ జరుగుతున్నాయి. అలాగే మరోవైపు సంపూర్ణేష్ రెండో చిత్రానికి హైప్ క్రియేట్ చేయటానికి, ఆ మూవీలో ఓ స్టార్ హీరోయిన్ ని ఓ స్పెషల్ రోల్ కోసం సెర్చింగ్ చేస్తున్నారంట. అందుకోసం ప్రస్తుతం టాలీవుడ్ లో లీడింగ్ లో ఉంటున్న హీరోయిన్స్ లో ఒకరు, సంపూర్ణేష్ సరసన ఓ గెస్ట్ రోల్ లో నటించేందుకు ఇప్పటికే రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఆ హీరోయిన్ కి సంబంధించిన పేరుని చిత్రయూనిట్ అఫిషియల్ గా అనౌన్స్ చేయనుందని అంటున్నారు. కొంత మంది ఆ హీరో శ్రేయ అని అంటుంటే, మరికొంత మంది రెజీనా అని అంటున్నారు. ఎవరు బర్నింగ్ స్టార్ మూవీలో గెస్ట్ రోల్ చేస్తారు అనేది మరి కొద్ది రోజుల్లో తెలియనుంది.
 
Top