సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస మూవీలు చేసుకుంటూ తనదైన మార్క్ యాక్టింగ్ చేస్తూ,సినీ ప్రేక్షకులను అలరిస్తున్న యాక్టర్ కలర్ స్వాతి. ఇదిలా ఉంటే కోలీవుడ్ మీడియాకి చెందిన ఓ న్యూస్ ఛానల్ కలర్ స్వాతికి సంబంధించిన ఓ విషయాన్ని నేడు టెలికాస్ట్ చేసింది. ఆ మేటర్ ఏంటంటే త్వరలోనే కలర్ స్వాతి పెళ్లికి సిద్ధంగా ఉందని సారాంశం. మేటర్ లోకి వెళితే కలర్ స్వాతి గత కొంత కాలంగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం నడుపుతుంది. అంతే కాకుండా వీరిద్దరూ పెళ్లికి సిద్ధపడుతున్నట్టుగా కోలీవుడ్ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. దీంతో కలర్ స్వాతి పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పడు హాట్ టాపిక్ గా మారాయి. తెలుగు ఛాన్సల్స్ లో యాంకర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన కలర్ స్వాతి, తరువాత యాక్టర్ గా తెలుగు ప్రేక్షకుల మనస్సులో తనకంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. అంతే కాకుండా కేవలం తెలుగు మూవీలతోనే ఆగిపోకుండా, అటు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ కలర్ స్వాతి తనదైన సక్సెస్ ను చూపిస్తుంది. నిజానికి తెలుగు మార్కెట్ కంటే కోలీవుడ్ మార్కెట్ లోనూ కలర్ స్వాతికి డిమాండ్ ఎక్కువుగా ఉంది. తను తాజాగా కోలీవుడ్ లో నటించిన మూవీలు అక్కడ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని సాధించి పెట్టింది. అయితే కోలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమైతే కలర్ స్వాతి త్వరలోనే వైవాహిక జీవితానికి వెల్ కం చెప్పబోతుందన్నమాట. ఈ మొత్తం వ్యవహారం కలర్ స్వాతి ఏ హీరోతో ప్రేమ వ్యవహారం నడుపుతుందనే ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉందట.
 
Top