ఒకనాటి ‘బొమ్మరిల్లు’ లవర్ బాయ్‌ సిద్దార్థ్ తన లుక్ పూర్తిగా మార్చుకుని నటుడిగా తానేమిటో చూపించడానికి నటిస్తున్న తమిళ సినిమా ‘ఎనక్కుల్ ఒరువన్’ లో సిద్ధూ లుక్ ప్రస్తుతం టాక్ ఆఫ్ కోలీవుడ్ గా మారింది. ఈ సినిమాలో సిద్ధూ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. సిద్దార్థని ఈ లుక్‌లో చూసిన అభిమానులే గుర్తు పట్టలేనంతగా మారి తన అభిమానులకు షాక్ ఇచ్చాడు ఈ లవర్ బాయ్. ఈ మధ్య కోలీవుడ్ లో కూడ సిద్ధార్ధకు అవకాశాలు తగ్గి పోవడంతో నటుడిగా తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధూ ఈ ప్రయోగం చేస్తున్నాడు అనుకోవాలి. ఇటీవల శాండిల్‌వుడ్‌లో హిట్టయిన ఒక సినిమాని ఆధారంగా తీసుకుని కోలీవుడ్‌లో ‘ఎనక్కుల్ ఒరువన్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో సిద్ధార్ద్ కనిపించే పాత్రలలో ఒకటి క్లాస్, మరొకటి మాస్. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైన వెంటనే కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. పక్కా మాస్ లుక్ తో కనిపిస్తున్న సిద్దార్థ్ లుక్ ను చూసిన వారు సిద్ధూను పోల్చు కోవడంలో ఇబ్బంది పడ్డారు అంటే ఈ సినిమా కోసం సిద్ధూ ఎంత కష్ట పడ్డాడో అర్ధం అవుతుంది. వెరైటీ సినిమాలను ఆదరించే కోలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తే సిద్ధూ దశ తిరిగినట్లే అనుకోవాలి.
 
Top