బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె శ్వేతబసు వ్యవహారం పై ఎవరూ సాహసించి చెప్పలేని కామెంట్స్ చేసి సంచలనానికి తెర తీసింది. గత కొద్ది రోజుల క్రితం వ్యభిచార ఆరోపణల పై అరెస్టు అయిన శ్వేత వ్యవహారం పై మీడియాతో మాట్లాడుతూ ఈ సమాజంలో ఎవరికీ వారు వారి కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎవరికి ఇష్టమైన మార్గాన్ని వాళ్లు ఎంచుకుంటారని అంటూ అది ఒకరికి మంచి అనిపించవచ్చు, మరొకరికి చెడు అనిపించవచ్చు అంటూ కామెంట్ చేసింది దీపిక. అయినా తప్పని పరిస్థితుల్లో శ్వేతబసు వేరే మార్గాన్ని ఎంచుకుంటే తప్పు ఏమిటని మీడియా సాక్షిగా ఆమె చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎదుటి మనిషి కష్టంలో ఉంటె వారికి సహాయం చేసి వారికి మానసిక ధైర్యాన్ని కలిగించవలసింది పోయి ఆ వ్యక్తి మానసిక ధైర్యాన్ని దెబ్బ తీసే విధంగా మాట్లాడటం దురదృష్టం అని అభిప్రాయ పడింది దీపిక. ఈ మధ్యనే బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా, టాలీవుడ్ హీరో విష్ణు శ్వేత నటిస్తాను అంటే అవకాశాలు ఇస్తాము అని ప్రకటించిన నేపధ్యంలో దీపిక చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రెస్క్యూ హోమ్ లో ఉన్న శ్వేతకు ఖచ్చితమైన మానసిక ధైర్యాన్ని ఇస్తాయి అనుకోవాలి. అయితే బాలీవుడ్ బ్యూటీ దీపిక చేసిన వ్యాఖ్యల పై మన న్యాయశాస్త్ర నిపుణులు ఎటువంటి అభిప్రాయాలు వేల్లడిస్తారో చూడాలి.
 
Top