ఈ మధ్య కాలంలో హీరోలు, హీరోయిన్స్ ఎక్కువుగా టెక్నాలజీకి సంబంధించిన వాటిని ఉపయోగించటానికి ఆసక్తిని చూపిస్తున్నారు. స్టార్ డం కలిగి ఉన్న హీరోలు, హీరోయిన్స్ ఎక్కువుగా వేల రూపాయలు ఖరీదు చేసే మొబైల్ ఫోన్స్, అలాగే లక్షలు ఖరీదు చేసే నోట్స్, ల్యాప్ టాప్స్ వాడుతున్నారు. అయితే వారు ఉపయోగిస్తున్న వాటిట్లో ఎటువంటి సమాచారాన్ని భద్రపరుస్తారు? వారు ఉపయోగిస్తున్న ఫోన్స్ లో ఎటువంటి డేటా ఉంటుంది? ఎటువంటి మెసేజెస్ ఉంటాయి? అన్న దానిపై చాలా మందికి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తన ల్యాప్ టాప్ లో ఏమున్నాయో ఓ హీరోకి చూపించిందట. దాంతో ఆ హీరో అవాక్కయ్యాడంటూ చిత్ర యూనిట్ నుండి టాక్స్ బయటకు వచ్చాయి. అయితే ఈ వ్యవహారం బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వెళ్ళే సరికి, శ్రద్ధా కపూర్ తన ల్యాప్ టాప్ లో అటువంటి వీడియోలు ఏమి లేవంటూ చెబుతుంది. దీంతో శ్రద్ధా తన మాటను మార్చేసిందంటూ బిటౌన్ లో హల్ చల్ చేస్తుంది. శ్రద్ధా కపూర్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ షూటింగ్ లో ఈ వ్యవహారం జరిగింది. తను ఎప్పుడు షూటింగ్ కి వెళ్ళినా, తన వెంట ఓ ల్యాఫ్ టాప్ ని మెయింటెన్ చేస్తుంది. అయితే ఆ ల్యాప్ టాప్ లో ఏముందో చూడాలని హీరో శ్రద్ధాని అడగగా, తను వెంటనే అందులో ఏముందో చూపించింది. అయితే ఆ హీరో శ్రద్ధా వాడుతున్న ల్యాప్ టాప్ లో హాట్ వీడియోలు ఉన్నట్లుగా చిత్ర యూనిట్ కి చెప్పాడు. దీంతో చిత్రయూనిట్ విషయం తెలుసుకున్న వెంటనే, శ్రద్ధా ఈ తరహా వీడియోలను కూడ చూస్తుందా? అంటూ కామెంట్ చేయడం మొదలు పెట్టారంట. అయితే విషయం ఎక్కడికో వెళ్ళడంతో, శ్రద్ధా హీరోకి గట్టిగా స్ట్రోక్ ఇచ్చింది. దాంతో ఆ హీరో తను చెప్పింది అంతా ఫన్ కోసమే అని మళ్ళీ సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో చెప్పటంతో ఆ వ్వవహారం కొద్దిగా సద్దుమణిగింది.
 
Top