టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న యాక్టర్ మహేష్ బాబు. మహేష్ బాబు తన వరుస మూవీలతో టాలీవుడ్ బాక్సాపీస్ నెంబర్ వన్ హీరోగా ఎదుగుతున్నాడు. ఇదిలా ఉంటే తను తాజాగా నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ ఆగడు మూవీకి సంబంధించిన బిజినెస్ సైతం టాలీవుడ్ లో హైయస్ట్ బిజినెస్ ని చేయగలిగింది. ఇప్పటి వరకూ ఏ మూవీకి రానంత ప్రి-బిజినెస్ ఈ ఆగడు మూవీకి వచ్చింది. అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఆగడు మూవీని, నిర్మాతలు చాలా తెలివిగా బిజినెస్ చేశారు. మహష్ బాబు నటించిన గత చిత్రం వన్ మూవీ బాక్సాపీస్ వద్ద ప్లాప్ అయినప్పటికీ, ప్రస్తుతం ఆగడు మూవీ బిజినెస్ పై ఆ ప్రభావం ఎంత మాత్రం కనిపించలేదు. ఏరియా వైజ్ బిజినెస్‌ విషయంలో మహేష్‌ మూవీ కొత్త రికార్డ్ లని క్రియేట్‌ చెస్తోంది. ఇండియాలోనే 60కోట్ల వరకు.. ఓవర్సీస్ లో అత్యధికంగా 9 కోట్ల వరకు ఆగడు ధియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. ఇక ఆస్ట్రేలియాతో పాటు ఇతన దేశాలలో విడుదల చేసేందుకు 14 రీల్స్ సంస్థ చూస్తుంది. అలాగే ఈ మూవీ విడుదల కోసం ఏరోస్‌ సంస్ద ముందుకు రావడంతో ఓ భారీ భాలీవుడ్‌ సినిమా తరహాలో ఆగడు గ్రాండ్‌ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక శాటిలైట్‌ రైట్స్ బ్రాండింగ్‌ వల్ల నిర్మాతలకు ఆగడు మరింత ఆదాయాన్ని సమకూర్చనుంది. ఓ విధంగా సినిమా విడుదలకు ముందే ఆగడు నిర్మాతలకు 10కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టనుందని సమాచారం. ఇప్పటికే అధికారిక బాక్సాపీస్ లెక్కల ప్రకారం ఆగడు మూవీ రిలీజ్ కి ముందే భారీ బిజినెస్ ని కైవసం చేసుకొని నిర్మాతలకి లాభాలని తెచ్చిపెట్టిందటే టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీలో తమన్న మొదటి సారిగా మహేష్ బాబు సరసన హీరోయిన్ గా చేస్తుంది.
 
Top