చిరంజీవి వెంకటేష్ లాంటి టాప్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్స్ తో నటించిన
ఆర్తీఅగర్వాల్ కెరియర్ ఆనాటి ఒక యంగ్ హీరోతో నడిపిన ప్రేమ కధ విఫలం అవడంతో
ఆర్తీ కెరియర్ అసంపూర్ణంగా టాలీవుడ్ లో ముగిసి పోయింది. ఆ తరువాత ఆమెకు
ప్రమాదం జరగడం అవకాశాలు లేకపోవడం తెలిసిన విషయాలే.
ఆమధ్య సునీల్ తో ‘అందాల రాముడు’ సినిమాలో నటించి విజయం సాధించినా ఆర్తీకి
చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోవడంతో పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళి పోయింది.
అయితే చాల గ్యాప్ తరువాత ఆర్తీ నటిస్తున్న ఒక సినిమా సంచలనంగా మారింది.
దీనికి కారణం ఆర్తీ ఈ సినిమాలో ఒక ఘాడమైన ఒక లిప్ లాక్ సీన్ లో నటించింది. ఈ
సినిమాను భరత్ పారేపల్లి అనే దర్శకుడు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం,
బెంగాలీ, భోజ్‌పూరి భాషల్లో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన
కొన్ని ముఖ్యసన్నివేశాలను ఈ మధ్య అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరించి ఈ
సినిమా హీరో ముకుల్ దేవ్ తో ఆర్తీ నటించిన ఘాడమైన లిప్ లాక్ సీన్ ను
చిత్రీకరించడం టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది.
ఈ సినిమాలో హీరో ఒక నక్సలైట్ గా నటిస్తూ ఉంటే ఆర్తీఅగర్వాల్ ఒక అమాయకమైన
అమ్మాయిగా నటిస్తోంది. చాల కాలం తరువాత ఆర్తీ నటిస్తున్న ఈ సినిమాలో ఆమె
చేస్తున్న లిప్ లాక్ సాహసం ఆమెకు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.
Home
»
aarthi agarwal
»
aarthi agarwal lip lock
»
telugu film news
»
హాట్ టాపిక్ గా మారిన ఆర్తీఅగర్వాల్ లిప్ లాక్ సీన్ !