సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాజల్ కి మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, ప్రస్తుతం తను బిజిగా ఉండటం వల్ల, కోలీవుడ్ మూవీలపై అంతగా శ్రద్ధ చూపించలేకపోతుంది. ఇదిలా ఉంటే తమిళ హీరో, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ కాజల్ అగర్వాల్ పై తమిళ చిత్ర నిర్మాతల సంఘంలో కంప్లైంట్ చేశారు. గతంలో వీరిద్దరూ కలిసి ఓ మూవీలో కలిసి నటించాలి. అయితే కాజల్ అగర్వాల్ బజి కాల్షీట్స్ కారణంగా వీరి కాంబినేషన్ సెట్స్ మీదకు రాలేకపోయింది. అయితే తాజాగా వీరిద్దరూ మరోసారి జోడీ కట్టేందుకు సిద్ధం అయ్యారు. ‘నన్బెండా’ అనే చిత్రంలో నటించేందుకుగాను కాజల్ అగర్వాల్ కు 50 లక్షల రూపాయలను అడ్వాన్సుగా చెల్లించారు. చివరి నిముషంలో ఆ సినిమాలోనూ కాజల్ నటించలేదు. తన డబ్బులు తనకు తిరిగి ఇప్పించాల్సిందిగా నిర్మాతల సంఘంను ఉదయనిధి స్టాలిన్ పిర్యాదు చేశాడు. ఎందుకంటే ఈ మూవీకి ఉదయనిధి స్టాలిన్ హీరో మాత్రమే కాకుండా, చిత్ర నిర్మాతగా కూడ వ్యవహరిస్తున్నాడు. చివరకు కాజల్ స్థానంలో ‘నన్బెండా’లో ఉదయనిధి స్టాలిన్ సరసన హీరోయిన్ గా నయనతార నటించింది. ఈ మొత్తం వ్యవహారంలో కాజల్ అగర్వాల్ 50 లక్షల రూపాయల అడ్వాన్సు తిరిగి ఇవ్వకుండా, ఉదయనిధి స్టాలిన్ హీరోగా తెరకేక్కబోయే తర్వాత సినిమాలో నటించేలా కాజల్ ఒప్పందం చేసుకోవటానిక ప్రయత్నించింది. అందకు ఉదయనిధి స్టాలిన్ ఒప్పుకోలేదు. తను ఇచ్చిన అడ్వాన్స్ ని ఇచ్చిన గడువులోపు ఇవ్వకుంటే కోలీవుడ్ నుండి బహిష్కరిస్తానని కాజల్ కి హెచ్చరికలు చేస్తున్నాడంట. ప్రస్తుతం ఈ బ్యూటీ, అంత పెద్ద అమౌంట్ ని సర్ధుబాటు చేసుకునే పనిలో ఉందని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. తెలుగులో ‘గోవిందుడు అందరివాడేలే’, ఎన్టీఆర్ – పూరి జగన్నాధ్ సినిమా, తమిళంలో మరొక సినిమాలో నటిస్తుంది. మొత్తానికి కాజల్ భలే ఇరుక్కుందిలే అని టాప్ హీరోయిన్స్ తెగ సంతోషపడుతున్నారంట.
 
Top