ఒకప్పుడు గ్లామర్ ఇండస్ట్రీ అంటే కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీ అనే
భావిస్తుంటారు. కాని ఇప్పుడు గ్లామర్ ఇండస్ట్రీ అంటే అర్ధాలే మారిపోయాయి.
ఎక్కడ కలరింగ్ ఎక్కువుగా ఉంటుందో, అక్కడ ఇండస్ట్రీ అంతా గ్లామర్ గా
మారిపోతుంది. అయితే టాలీవుడ్ కి ధీటుగా తెలుగులోనూ బుల్లితెర మార్కెట్
రోజు రోజుకీ పెరుగుతుంది. ఒక్క బుల్లితెర మార్కెట్ సంవత్సర లెక్కలు
చూసుకుంటే వందల కోట్ల రూపాయలలో బిజినెస్ జరుగుతుంది. ప్రస్తుతం తెలుగు
టెలివిజన్ కొత్త కొత్త షోలతో ఇంటింటా ఆనందాన్ని పంచుతుంది.
దాంతో కొత్త యంకర్స్ అంతా బుల్లితెరకు పరిచయం అవుతున్నారు. అయితే
సంప్రదాయంగా సాగాల్సిన షోలలో కూడ పొట్టి పొట్టి దుస్తులతో కుర్రకారుని
టార్గెట్ చేస్తూ షోలు వస్తున్నాయి. క్వాలిటి పెరుగుతున్న కొద్ది, యాంకర్స్
డ్రెస్ లు కూడ పొట్టిగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే రీసంట్ గా ఓ ప్రవేట్
స్టూడియోలో ప్రముఖ టెలివిజన్ కి రియాలిటి షో చేస్తున్న యాంకర్ కి
సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.
ఆ ఫోటోలలో తన డ్రెస్ ఛేంజ్ చేసుకుంటున్న ఫోటోలు ఉండటంతో బుల్లితెర
ఇండస్ట్రీ అంతా అవాక్కవుతుంది. ఇప్పటి వరకూ హీరయిన్స్ విషయంలో జరుగుతున్న
అసభ్య కల్ఛర్, ఇప్పుడు యాంకర్స్ విషయంలోనూ జరుగుతుండటంతో, అప్ కమింగ్
యాంకర్స్ తో పాటు, లీడింగ్ యాంకర్స్ సైతం ఎంతో జాగ్రత్త పడుతున్నారు. అయితే
ఆ ఫోటోలు రియాలిటిషో కి పనిచేస్తున్న వారిలో కొంత మంది కావాలని చేస్తేనే, ఆ
తరహా ఫోటోలు తీయడం సాధ్యపడదు అని అంటున్నారు. మొత్తానికి ప్రస్తుతానికి
మొబైల్ ఉన్న ఫోటోలు, నెట్ లోకి రాకుండా ఉంటే మంచిదని అంటున్నారు.