కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీలియోన్ కి టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో సన్నీ చేసిన తొలిచిత్రం 'కరెంట్ తీగ' ఇంకా రిలీజ్ కాకుండానే సన్నీ లియోన్ ఆఫర్లు కొట్టేస్తోంది. ఎన్టీఆర్ సినిమాలో నటించే ఛాన్స్ ని సన్నీలియోన్ కొట్టేసిందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో సన్నీతో ఓ హాట్ ఐటెం సాంగు చేయించనున్నట్టు చిత్రయూనిట్ నుండి క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఐటెం సాంగులకు పెట్టింది పేరైన పూరీకి సన్నీతో ఇప్పటికే పరిచయం వుంది. దానికి తోడు 'కరెంట్ తీగ'లో ఆమె నటించిన ఐటెం సాంగును ప్రత్యేకంగా ప్రొజక్షన్ వేయించుకుని చూశాడట. ఇప్పటికే సన్నీలియోన్ తో పూరీ జగన్నాధ్ మాట్లాడటం, అందుకు సన్నీలియోన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. జూనియర్ ఎన్టీర్ మూవీలో ఐటెం సాంగ్ అనేది చాలా స్పెషల్ గా ఉంటుందని, అందుకు సన్నీలియోన్ ని తీసుకుంటున్నామని పూరీ ఇప్పటికే జూనియర్ తో చెప్పాడు. జూనియర్ అందుకు ఓకె అన్నాడు. దీంతో సన్నీలియోన్ కి సంబంధించిన సాంగ్ షూటింగ్ ని డిసెంబర్ మొదటి వారంలో చిత్రీకరించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సాంగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్ లో చిత్రీకరించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తంగా సన్నీలియోన్ తో పూరీ డీల్ ని క్లోజ్ చేశాడనే టాక్స్ టాలీవుడ్ లో బలంగా వినిపిస్తుంది. దీనికి సంబంధించిన అఫిషియల్ స్టేట్ మెంట్ త్వరలోనూ పూరీజగన్నాధ్ అనౌన్స్ చేయనున్నాడని అంటున్నారు. మొత్తానికి సన్నీలియోన్ వరుస ఆఫర్స్ చేజిక్కించుకుంటూ టాలీవుడ్ ని షేక్ చేయబోతుందన్నమాట.
 
Top