పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ నిర్మాతలకి షాకింగ్ గా మారాడు. పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గోపాల గోపాల మూవీ షూటింగ్ లో నటిస్తున్నాడు.
విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం,
టాలీవుడ్ లో బిగ్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కబోతుంది. మొదట ఈ మూవీలో పవన్
కళ్యాణ్ రోల్ ని కేవలం గెస్ట్ పాత్రకే పరిమితం చేద్ధాం అనుకున్న చిత్ర
టీం, తరువాత పవన్ కళ్యాణ్ పాత్రకి కొద్దిగా మార్పులు చేసి మూవీలో ఎక్కువ
నిడివి ఉండేలా ప్లాన్ చేశారు. దీంతో గోపాల గోపాల మూవీ ప్రస్తుతం బిగ్
మల్టీస్టారర్ మూవీగా మారింది.
ఇదిలా ఉంటే గోపాల గోపాల మూవీ తరువాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్2 లో
నటించాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ తాజాగా తీసుకున్న నిర్ణయం బట్టి, గబ్బర్
సింగ్2 ప్రాజెక్ట్ ని ఆపేయాలని నిర్ణయించుకున్నాడు. తను ఒక్కో సినిమాకి
దాదాపు నాలుగు నెలల నుండి ఆరు నెలల వరకూ టైం తీసుకుంటున్నాడు. దీంతో తను
స్థాపించిన జనసేన పార్టీకి ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నాడు. జనసేన
పార్టీని బలోపేతం చేయటానికి పవన్ కళ్యాణ్ ఎక్కువ సమయాన్ని ప్రజలకు
కేటాయించాలి.
తను ఒక్కో మూవీకి ఒక్కో సంవత్సర సమయం తీసుకుంటుంటే, ఇప్పటికే పవన్ కళ్యాణ్
స్థాపించిన పార్టీపై ప్రజల్లో విశ్వాసం కోల్పోతుంది. ఇటువంటి సమయాల్లో తను
గబ్బర్ సింగ్2 మూవీ కొనసాగించడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్
భావిస్తున్నట్టుగా టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే గబ్బర్
సింగ్2 ప్రాజెక్ట్ ఇప్పట్లో లేదనే విషయాన్ని, పవన్ కళ్యాణ్ నిర్మాతలకి
చెప్పి, వారిని కన్విన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్
తీసుకుంటున్న ఈ నిర్ణయానికి, నిర్మాతల వద్ద నుండి ఎటువంటి రియాక్షన్
ఉంటుందో చూడాలి మరి.