దీపావళికి రాబోతున్న ‘ఐ’ సినిమాకు సంబంధించిన స్టిల్స్ ఒకొక్కటిగా బయటకు వస్తుంటే ఆ సినిమా పై క్రేజ్ విపరీతంగా పెరిగి పోతోంది. భయంకరమైన మానవ మృగ గెటప్ తో విక్రమ్ ఒక యువరాణితో చేస్తున్న రొమాన్స్ ఈ సినిమా పై అంచనాలను విపరీతంగా పెంచేస్తోంది.  ఇప్పటి వరకు టాప్ దర్శకులు చాల మంది పువ్వులతో, పండ్లతో రొమాన్స్ ను పండిస్తే శంకర్ ఏకంగా ఒక మానవ మృగానికి ఒక యువరాణికి మధ్య నడిచిన రొమాన్స్ ను చాల వెరైటీగా చిత్రీకరించాడు అనే వార్తలు మీడియాను షేక్ చేస్తున్నాయి. విక్రమ్, యామీ జాక్సన్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘మనోహరుడు’ మూవీలో ఇలాంటి చిత్ర, విచిత్రమైన ఎన్నో అద్భుతాలు ఉన్నాయనే ప్రచారం కోలీవుడ్ లో విపరీతంగా జరుగుతోంది.  ఈ వారంలో జరగబోతున్న ఆడియో వేడుక తరువాత ఈ సినిమా క్రేజ్ విపరీతంగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని విశ్లేషకులు అంటున్నారు. అపరిచితుడు తరువాత సరైన హిట్ లేని విక్రమ్ కు ఈ సినిమా కూడ అనుకున్న బ్రేక్ ఇవ్వలేకపోతే ఇక విక్రమ్ కెరియర్ కు తీవ్ర సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అనేది వాస్తవం.
 
Top