సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపిన హాట్ బ్యూటీ ఇలియానకి ప్రస్తుతం గుడ్
టైం నడుస్తుందని అంటున్నారు. ఎందుకంటే తను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని
వదిలేసిన తరువాత, ఇక్కడ నుండి ఎన్ని అవకాశాలు వచ్చినా, వాటిలో నటించేది
లేదంటూ, బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే పాగా వేసుకొని కూర్చుంది. అయితే
బిటౌన్ లోనూ ఇలియాన ఇప్పటి వరకూ చాలా మూవీలు చేస్తున్నప్పటికీ, తను
హీరోయిన్ గా అవకాశాలని చేజిక్కించుకోవటానికి చాలానే కష్టపడాల్సి వస్తుంది.
ఇదిలా ఉంటే ఇలియాన ప్రస్తుతం బిటౌన్ లో ఓ భారీ ఆఫర్ ని చేజిక్కించుకుందనే
టాక్స్ వినిపిస్తున్నాయి. షారుఖ్ ఖాన్ నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్
'ఫ్యాన్' లో ఇలియానాను హీరోయిన్ గా తీసుకున్నారనే వార్తలు బలంగా
వినిపిస్తున్నాయి.
యశ్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మితం కాబోతున్న ఈ సినిమాకు మహేష్
శర్మ దర్శకుడు. అయితే ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా ఇందులో ఇలియానానే హీరోయిన్
అని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ అక్టోబర్ నుంచి ఫ్యాన్ సినిమా సెట్స్ పైకి
వెళ్లబోతోంది. మరి ఇదే నిజమైతే ఇలియానా దశ తిరిగినట్టే అనుకోవాలి. అయితే
యశ్ రాజ్ బ్యానర్ లోకి హీరోయిన్ గా ఎవరు వచ్చినా, కేవలం ఒక్క మూవీతోనే
సరిపెట్టుకోరు. దాదాపు రెండు, మూడు చిత్రాలతో హీరోయిన్స్ చేత యశ్ రాజ్
ప్రొడక్షన్స్ అగ్రిమెంట్ చేయించుకుంటుంది. ఆ విధంగా ఇలియాన సైతం ఇప్పడు యశ్
రాజ్ ప్రొడక్షన్స్ లో ఓ మూడు చిత్రాలు నటించేదుంకు దాదాపు సైన్ కూడ
చేసిందని అంటున్నారు.
అందులో ఒక మూవీ షారుఖ్ ఖాన్ తో అయితే, మరో మూవీ రణ్ భీర్ కపూర్, సల్మాన్
ఖాన్ లతో ఉంటుందనే టాక్స్ బిటౌన్ లో వినిపిస్తుంది. యశ్ రాజ్ ప్రొడక్షన్స్
మొత్తంగా మూడు చిత్రాలతో నటించేందుకు ఇలియాన దాదాపు రెండున్న కోట్ల రూపాయల
రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా బిటౌన్ లో స్ట్రాంగ్ టాక్స్
వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇలియానకి బిటౌన్ లో జెట్ స్పీడ్ తో
దూసుకుపోయో టైమ్ వచ్చిందనే చెప్పవచ్చు.