పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ తన పై విమర్శలు గుప్పిస్తున్న విమర్శకుల పైన,
మీడియా పైన ఘాటు వ్యాఖ్యలు చేసింది. తాను సినిమా రంగంలో ఎదగడానికి ఎవరి
ఇమేజ్ ని వాడుకుంటూ ఎదగడం లేదనీ గత సంవత్సరం సినిమా నిర్మాణ రంగంలో అడుగు
పెట్టిన తనకు లభించిన కీర్తి అంతా తన స్వయం కృషితో వచ్చిందని చెపుతూ
అనుకోని ట్విస్ట్ ఇచ్చింది రేణు.
తన సోషల్ నెట్ వర్కింగ్ పేజ్ లో ఈ విషయమై కామెంట్లు రాస్తూ “పవన్ కళ్యాణ్
ఇమేజ్ ను వాడుకుంటూ తాను ఎదుగుతున్నాను అన్న కొంతమంది అతి తెలివితేటలతో
కూడిన కామెంట్లకు సమాధానం ఇస్తున్నాను. క్రితం సంవత్సరం నేను నిర్మించిన
‘మంగళాష్టక్’ ఎవరి సహాయం లేకుండానే నిర్మించాను. నా సమర్ధత చూసి పవన్
కళ్యాణ్ గారు కూడ అభినందించారు. కాబట్టి నాపై అతి తెలివి తేటలతో కామెంట్స్
చేస్తున్న మీ తెలివైన బుర్రలకు రెస్ట్ ఇవ్వవలసినదిగా కోరుతున్నాను” అంటూ
ఘాటైన కామెంట్స్ తో తన విమర్శకుల పై ఎదురుదాడికి దిగింది రేణు.
అంతేకాదు తాను ఒక ప్రముఖ హీరోయిన్ మరియు మోడల్ అనే విషయాన్ని కూడ తన
విమర్శకులు గ్రహిస్తే బాగుంటుందని సెటైర్లు వేసింది రేణుదేశాయ్. అయితే
రేణుదేశాయ్ ఇంత హడావిడిగా తన విమర్శకుల పై ఎదురు దాడి చేయడం వెనుక ఎదో ఒక
వ్యూహాత్మక ఎత్తుగడ ఉందా? లేదా అకిరా నందన్ ను సినిమాలలో నటింప చేసిన విషయం
పై పవన్ అసంతృప్తిగా ఉన్నాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో పవన్ కళ్యాణ్
కు తన వ్యక్తిత్వాన్ని తెలియ చేసే ఉద్దేశ్యంతో ఈ ఘాటు కామెంట్లు చేసిందా
అనే విషయం రానున్న రోజులలో తెలియనున్నది.