శంకర్ మాయాజాలం ‘ఐ’ సినిమా ఆడియో వేడుక నిన్న సాయంత్రం చెన్నైలో అత్యంత ఘనంగా జరిగింది. విపరీతమైన అంచనాలతో భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ట్రైలర్ నిన్న సాయంత్రం విడుదలైన కొద్ది సమయంలోనే సంచలనాలు సృష్టించింది.  గత కొద్ది గంటలుగా ఈ సినిమా ట్రైలర్ వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. కేవలం పన్నెండు గంటలలో 9 లక్షల హిట్స్ ఈ ట్రైలర్ కు రావడం బట్టి ఈ సినిమా పై ప్రేక్షకులలో ఎటువంటి ఆశక్తి ఉందొ అర్ధం అవుతుంది. సినిమా ప్రారంభం నుండి అనేక సంచలనాలకు, విశేషాలకు చిరునామాగా ఉన్న ఈ సినిమా ట్రైలర్ లోని గ్రాఫిక్స్ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తి వేస్తూ ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఫీల్ ను ప్రేక్షకులకు అందిస్తోంది.  ఈ సినిమాలో శంకర్ గ్రాఫిక్స్‌ని విపరీతంగా ఉపయోగించాడు అనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి స్పష్టం అవుతోంది. విక్రమ్ డిఫరెంట్ గెటప్స్, లొకేషన్స్ అన్నీ సూపర్‌గా ఉన్నాయంటూ నెటిజన్లు ఒకరికి ఒకరు తమ అభిప్రాయాలను ఈ సినిమా పై అప్పుడే షేర్ చేసుకుంటూ అంచనాలను మరింత పెంచేస్తున్నారు. దీపావళికి రాబోతున్న ఈ అద్భుతం దక్షిణ భారతదేశ సినిమా రికార్డులను తిరగ రాయడం ఖాయం అని అంటున్నారు.
 
Top