కోలీవుడ్ క్రేజీ బ్యూటి హన్సిక రాబోతున్న ఆగష్టు 9వ తారీఖుకు 23 సంవత్సరాల వయస్సులోకి ప్రవేసిస్తోంది. హన్సికకు మంచి నటిగానే కాకుండా మంచి పెయింటర్ గా కూడ ప్రావీణ్యం ఉంది. తాను నటిస్తున్న సినిమాల షూటింగ్ లో కాస్త విరామం దొరికితే చాలు తన స్కెచ్ పెన్సిల్ తో రకరకాల బొమ్మలు వేస్తూ హడావిడి చేస్తూ ఉంటుంది.  హన్సిక తాను వేసిన బొమ్మలు అన్నింటిని ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ కింద పెట్టి వాటి మీద వచ్చే ఆదాయంతో హన్సిక నెలకొల్ప బోతున్న ఒక వృద్దా ఆశ్రమానికి వినియోగించాలని ఆమె కోరిక. దీనికోసం ఆమె చాల కష్ట పడుతూ రకరకాల పెయింట్స్ వేస్తోంది.  అందులో ఆమె చిత్రీకరించిన రాధాకృష్ణ పెయింట్ ను హన్సిక ఇంకా ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్ట కుండానే ఒక వీరాభిమాని హన్సిక ఈ దేశంలో లేకపోయినా ఆమె తల్లికి 15 లక్షలు కొనుక్కోవడం ప్రస్తుతం కోలీవుడ్ కు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం హన్సిక తన చిన్ననాటి స్నేహితులందరినీ తన సొంత ఖర్చు పై స్పెయిన్, ప్యారిస్, బార్సిలోనా దేశాలకు తీసుకు వెళ్లి అక్కడ హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తోంది. మరొక ఆశక్తికర విషయం ఏమిటంటే హన్సిక రాబోతున్న తన పుట్టిన రోజునాడు మరో ఐదుగురు అనాధ పిల్లలను దత్తత తీసుకుని 28 మంది అనాధ పిల్లలకు తల్లిగా మారుతోంది ఈ యాపిల్ బ్యూటీ.
 
Top