సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని హీరోయిన్స్ లైఫ్ స్టైల్ మారిపోయిందని కచ్ఛితంగా చెప్పవచ్చు. అయితే హద్ధులు దాటిపోయిందని మాత్రం, అంతే కచ్ఛితంగా చెప్పలేము. ఇప్పటికీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ బయట ఎలా ఉన్నప్పటికీ, వారి ఆన్ స్క్రీన్ లుకింగ్ మాత్రం సౌత్ కల్ఛర్ కి తగ్గట్టుగానే ఉంటుంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ కి చెందిన ప్రముఖ మీడియా, సౌత్ గ్లామరస్ హీరోయిన్ తాప్సీని టార్గెట్ చేసింది. గత కొంత కాలంగా తాప్సీకి, కోలీవుడ్ మీడియాకి మధ్యలో పెద్ద వార్ నడుస్తుందని, తాప్సీనే చాలా సార్లు చెప్పుకొచ్చింది. తాజాగా తాప్సీ మరో కోలీవుడ్ మీడియా పై విరుచుకుపడింది. మేటర్ ఏంటంటే కోలీవుడ్ మీడియాలో తాప్సీ పెళ్ళికి సంబంధించిన విషయాలను, అలాగే తను నడుపుతున్న ఎఫైర్స్ వంటి విషయాలను ఎక్స్ క్లూజివ్ గా చెబుతుందట. ఈ విషయం తెలుసుకున్న తాప్సీ, కోలీవుడ్ మీడియాపై చాలా కోపంగా ఉంది. దీనిపై తాప్సీ స్పంధిస్తూ "తమిళంలో నా మొదటి సినిమా 'ఆడుకాలం' నుంచీ ఇలా రాస్తూనే వున్నారు. దీని వల్ల వాళ్లకేం వస్తుందో నాకైతే తెలియడం లేదు. నా కెరీర్ కి మాత్రం ఇబ్బంది కలుగుతోంది. అసలు నా పెళ్లి గురించి ఇంతవరకు నేనే ఆలోచించలేదు. అలాగే నాకు ఎటువంటి ఎఫైర్స్ లేవు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం పై స్పంధించటానికి నాకు మాత్రమే హక్కు వుంది. కోలీవుడ్ మీడియా ఎందుకు పనిగట్టుకొని తప్పుడు న్యూస్ రాస్తుందంటూ" చెప్పుకొచ్చింది. ఇకనైన తనను వదిలేయాలని తాప్సీ, మీడియాను కోరింది. ఇదిలా ఉంటే తాప్సీ గతంలో తమిళనాడుపై కామెంట్ చేసిందని, అందుకు రివేంజ్ గానే మీడియా తన వంతు పాత్ర పోషిస్తుందని కొందరు అంటున్నారు. మొత్తానికి కోలీవుడ్ కి తాప్సీ అంటే ఇష్టం లేనట్టుంది.
 
Top