క్యూట్ హీరోయిన్ సమంతను కొంతమంది ముద్దుగా మాయలేడి అని పిలుస్తూ ఉంటారు. ఆ
పేరుకు తగ్గట్టుగానే ప్రస్తుతం సమంత టాలీవుడ్ లో చలరేగిపోతోంది. వరుసగా
మూడు హిట్లు వచ్చేసాయి కాబట్టి తన పారితోషికం ఇంకా ఎందుకు పెరగడంలేదు అంటూ
సమంత తన మేనేజర్ ను టార్చర్ పెడుతోందట. అయితే ఈ విషయాన్ని సమంత స్వయంగా
చెప్పడం సంచలనం.
ఈమధ్య విడుదలైన ‘అల్లుడు శీను’ సినిమాను ప్రమోట్ చేస్తున్న సమంతను మీడియా
ప్రతినిధులు అల్లుడు శీను కోసం భారీగా పారితోషికం తీసుకోవడమే కాకుండా ఫామ్
హౌస్ లు కూడ తీసుకున్నారట కదా అని కొంటెగా ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించిన
ప్రశ్నకు సమాధానం ఇస్తూ సమంత మీ మీడియా వారు నాపారితోషికాన్ని
పెంచేస్తున్నారుకాని వరుసగా మూడు హిట్స్ ఇచ్చినా నిర్మాతలు ఒక్క రూపాయి కూడ
పెంచడం లేదు అంటూ తనకు కూడ తాను నటించిన సినిమాల నైజామ్ హక్కులు వచ్చేలా
సహాయం చేయవచ్చు కదా అంటూ మీడియాకే ఎదురు ప్రశ్న వేసి సమంత తన మనసులోని
మాటను బయట పెట్టింది.
మెగా స్టార్ గా వెలుగు వెలిగిన చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ సినిమాలకు
సంబంధించి పారితోషికంగా నైజామ్ రైట్స్ నిర్మాతలు ఆఫర్ చేసారు అనే వార్తలు
గతంలో వచ్చాయి. మరి ఆ స్థాయిలో సమంత పారితోషికాన్ని కోరుకోవడం ఆమె క్రేజ్
అనుకోవాలా? లేక సక్సస్ అనుకోవాలా? అందుకే ఆమెను మాయలేడి అని అంటారు.