వెబ్ మీడియాలో నిరంతర సందడి చేసే వర్మ అమ్మాయిలను బెదిరిస్తున్నడా? అయితే ఆ బెదిరింపు తన కొత్త సినిమా ద్వారా ఉండబోతోంది అన్న సంకేతాలు ఇస్తున్నాడు. ‘రౌడీ’ మూవీ తర్వాత మంచు విష్ణు హీరోగా రాంగోపాల్ వర్మ చేస్తున్న సరికొత్త సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు రకరకాల పేర్లు బయటకు వచ్చాయి. 'టెన్షన్ టెన్షన్', '12' అన్న పేర్లు కూడ వినిపించాయి. కానీ చివరకు వర్మ తన సరికొత్త ప్రయోగానికి 'అనుక్షణం' అనే టైటిల్‌ని కన్ఫర్మ్ చేయడమే కాకుండా ఈ టైటిల్ కు 'అమ్మాయిలూ జాగ్రత్త' అనే ట్యాగ్ ను కూడ నిర్ణయించాడు. ఈ టైటిల్ బయటకు రాగానే వర్మ సినిమాల మార్క్ కు తగ్గ టైటిల్ గా కనిపిస్తొంది అంటూ అప్పుడే సెటైర్లు కూడ ప్రారంభం అయ్యాయి.  వర్మ, మంచు విష్ణులు కలిసి ప్రారంభిస్తున్న కొత్త పంపిణీ విధానంలో విడుదల కాబోయే ఈసినిమా ఆన్ లైన్ వేలం పాటలకు ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి. ‘ఐస్ క్రీమ్’ లో హాట్ గా కనిపించిన తేజస్వి ఈ సినిమాలో కూడ ఎంత హాట్ గా కనిపిస్తుందో చూడాలి. ఇప్పటి వరకు దెయ్యాల సినిమాలతో జనాలను భయ పెట్టిన వర్మ తన లేటెస్ట్ సక్సస్ మంత్రంగా అమ్మాయిలను భయపెట్టే కార్యక్రమం చేపట్టాడు అని అనుకోవాలి.
 
Top