ఒకప్పుడు హీరోయిన్స్ ని రొమాంటిక్ సీన్స్ లో నటించమని అడగాలంటే తెగ
ఆలోచించాలి. ముందుగా పి.ఆర్ ని అడిగి, ఆ తరువాత పి.ఆర్ హీరోయిన్ తో
మాట్లాడి. ఇలా నాలుగైదు ప్రాసెస్ లు జరిగిన తరువాత హీరోయిన్ తో డైరెక్టర్
మాట్లాడాల్సి వచ్చేది. తరువాత జెనరేషన్ మార్పులో డైరెక్టర్సే హీరోలతో
మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడైతే టోటల్ గా సీన్ మారిపోయింది. హీరోయిన్స్
స్వయంగా రొమాంటిక్ సీన్స్ కావాలంటూ, హీరోలను బ్రతిమిలాడుకునే రోజులు
వచ్చాయి. సరిగ్గా ఇటువంటిదే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్
విషయంలో జరుగుతుంది. తమిళ హాట్ బ్యూటీ లక్ష్మీ మీనన్ తనతో నటించే హీరోలని ఏ
మాత్రం వదలటం లేదు.
మూవీలోని సాంగ్ లో ఏ మాత్రం ఛాన్స్ వచ్చినా లక్షీ మీనన్ రెచ్చిపోతుంది.
ముఖ్యంగా లిప్ లాక్స్ అంటూ హీరోలను బెధరగొడుతుందట. మొన్నటి వరకూ
సంప్రదాయంగా ఉండే అమ్మాయిలా కనిపించిన ఈ అమ్మడు, తరువాత రూటు మార్చి
హద్దులుదాటి మీరిపోతోంది. మేటర్ ఏమిటంటే తమిళ ‘‘గుంకీ’’ సినిమా ద్వారా
చిత్రపరిశ్రమకు పరిచయమైన హాట్ బ్యూటీ లక్ష్మీ మీనన్.. ఆ సినిమాలో డీ
గ్లామర్ రోల్ లో నటించి అందరి మన్ననలు పొందింది. తరువాత తన మీద ఉన్న
ఒపినియన్ ని మార్చే ప్రయత్నం చేసింది. అందిరినీ షాక్ కు గురిచేసేలా గ్లామర్
పాత్రల్లో నటించింది. దీంతో లక్ష్మీ మీనన్ అందాలు యూత్ ని నిద్రలేకుండా
చేస్తుంది. ఈ అమ్మడు విశాల్ తో కలిసి నటించిన మూడుసినిమాల్లో విచ్చలవిడిగా
లిప్ లాక్ లు ఇచ్చేసుకుంది.
అయితే ఈమె ప్రతి సినిమాల్లో ఇస్తున్న లిప్ లాక్ విషయం గురించి ఈమెను
ప్రశ్నిస్తే.. అందుకు ఘాటుగానే సమాధానం ఇచ్చింది. లిప్ లాక్ సన్నివేశాల
గురించి లక్ష్మీ మీనన్ చెబుతూ... ‘‘ఏ హీరో అయినా నాకు ఫర్వా లేదు. లిప్
లాక్ సన్నివేశాల్లో నటించడానికి నేను సిద్ధంగా వుంటాను. ఆ సన్నివేశాల్లో
నటించడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు’’ అని స్పష్టం చేసేసింది. ప్రస్తుతం
తమిళంలో మంచి పేరు సంపాదించిన ఈ అమ్మడు... ఇప్పుడు తమిళంలో సిద్ధార్థతో
కలిసి నటించిన ‘‘జిగార్తాండా’’, తెలుగులో ‘‘చిక్కడు దొరకడు’’ టైటిల్ ద్వారా
విడుదలవుతున్న మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.