సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరయిన్ గా ఉన్న సమంత, అభిమానులని ఉత్సాహపరిచే నిర్ణయం ఒకటి తీసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన టాక్స్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ రభస మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ ఆగష్టు 1న జరగుతుంది. శిల్పకళా వేధకలో జరగనున్న ఈ ఆడియో వేడుకకి సమంత, ప్రణీత లు హాజరవుతున్నారు. రీసెంట్ గా సమంత నటించిన అంజాన్ మూవీ ఆడియో ఫంక్షన్ కి, తను అటెండ్ కాలేకపోయింది. అందుకు సమంత రకరకాల కారణాలు చెప్పింది. అయినా సూర్య మాత్రం సమంత చేసిన పనికి ఇంకా కోపంగానే ఉన్నాడంట. ఇదిలా ఉంటే త్వరలో రభస ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి సమంత కంపల్సరీగా రావాలని జూనియర్ కోరాడు. అంతే కాకుండా ఆ స్టేజ్ మీద కొద్దిగా డ్యాన్స్ కూడ చేయాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సమంత సైతం జూనియర్ కి మాట ఇచ్చిందట. ఇప్పటి వవరూ ఏ ఆడియో ఫంక్షన్ లో డ్యాన్స్ చేయని సమంత, మొదటి సారిగా రభస మూవీ ఆడియో ఫంక్షన్ లో చిందులేయబోతుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం తెగ ఖుషీ అవుతున్నారు. సమంత ఆ రోజు చెన్నైలో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే సమంతకి అప్ అండ్ డౌన్ కి ట్రావెలింగ్ కోసం ఫ్లైట్ టికెట్స్ ని బుక్ చేసి, దానికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకున్నారు. ప్రస్తుతం సమంత ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజిగా ఉన్నారు. చివరి నిముషంలో రభస మూవీ ఆడియో ఫంక్షన్ రావడం కూడ డైటే అ ని అంటున్నట్టుగా టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.
 
Top