సెక్సీ ఐటెం బాంగ్ షకీలా షాకింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. గతంలో షకీలా ఆత్మకథను సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కారమవుతుందనే వార్తలు వచ్చాయి. ఈ సంచలన తార ఒకప్పుడు తన శృంగారాత్మక నటనతో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఉర్రూత లూగించారన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం స్కిన్ షో కు దూరంగా ఉండి, వివిధ కథా పాత్రలను పోషిస్తున్న షకీలా, లేటెస్ట్ గా కొత్త అవతారం ఎత్తారు. ప్రస్తుతం షకీలా మెగా ఫోన్ పట్టింది. తన ఆత్మ కథకు తానే దర్శకత్వం వహిస్తానంటుంది నటి షకీలా. ఈ మూవీని తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. మొదటగా తన ఆత్మకథకి తనే దర్శకత్వ పర్యవేక్షణ చేయాలనుకుంది. కాని చివరకి మాత్రం తనే డైరెక్షన్ బాధ్యతలను తీసుకుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి ఇంకా పేరు నిర్ణయించలేదు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ ఆంధ్రాలోని ఒక కుగ్రామంలో సెలైంట్‌గా జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించిన తాజా షెడ్యూల్ పై షకీలా మాట్లాడుతూ, దర్శకత్వం చేయూలన్నది తన చిరకాల కోరికగా చెప్పుకొచ్చింది. అందులోనూ తన మూవీకి తనే దర్శకత్వ బాధ్యతలను తీసుకోవడం అనేది తనకు హ్యాపీగా ఉందని అంటుంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంతో పాటు కన్నడ,మలయాళంలోనూ డబ్బింగ్ చేయనున్నారు. అలాగే తన ఆత్మకథను పుస్తక రూపంలో కి తీసుకొచ్చి ఇప్పటికే సంచలనం సృష్టించిన ఈ బహుభాషా నటి, ఆ కథతోనే చిత్రం తీసి ఇంకెంత కాంట్రవర్సీగా మారుస్తుందో చూడాలి మరి.
 
Top