సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ మౌనిక మత మార్పిడి చేసుకుంది.
ఎవ్వరికి తెలియకుండా మౌనిక చేసుకున్న మత మార్పిడి వెనుక చాలా పెద్ద కథే
ఉందని కోలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.దీనికి సంబంధించిన తాజా వివరాలను
ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. హరిక్రిష్ణ, జగపతిబాబు
నటించిన శివరామరాజు మూవీతో, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన
హీరోయిన్ మౌనిక. మౌనిక ఇప్పటి వరకూ దాదాపు యాభై చిత్రాల్లో నటించింది.
హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మౌనిక కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో
అందరికి తెలిసిన పర్సనాలిటి.
మౌనిక ఇప్పుడు ఇస్లాం మతాన్ని స్వీకరించింది. మౌనిక గా ఉన్న తన పేరుని
ఎంజీ.రహిమున్నిసాగా మార్చుకుంది. మలయళ చిత్రంలో పరవన పేరుతో చాలా మూవీలను
చేసింది. మౌనిక ఇంత షడన్ గా తన మతాన్ని మార్చుకోవడంతో కోలీవుడ్ వర్గాలకి
అంతుపట్టడంలేదు. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ ముస్లిం టెక్నిషియన్
తో మౌనిక ఎఫైర్ నడుపుతున్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. తనని తన బాయ్
ప్రెండ్ గా ఇంత కాలం చెప్పుకుంటూవచ్చింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్ళికి
సిద్ధంగా ఉన్నారనే టాక్ కూడ కోలీవుడ్ లో వినిపిస్తుంది. అందుకే మౌనిక మతం
మార్చుకున్నట్టుగా కథనాలు వస్తున్నాయి.
తమిళ్ లో చైల్డ్ యాక్టర్ గా మౌనిక కి చాలా పేరు ఉంది. ప్రస్తుతం మౌనిక
చేతిలో ఎటువంటి మూవీలు లేకపోవడం, త్వరలోనే తన పెళ్ళి మేటర్ ఉందని టాక్
రావండం వంటి విషయాలు తనపై వస్తున్న గాసిప్స్ కి బలాన్ని చూకూరుస్తున్నాయి.
ఏదేమైనా ఎవరు, ఏ మతాన్ని అయినా స్వీకరించవచ్చనేది వారికి ఉన్న హక్కులలో
ఒకటి. అందుకే మౌనిక ఈ విధమైన నిర్ణయం తీసుకుందని కొందరు అంటున్నారు.