బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్ర తన బరువును అమాంతంగా తగ్గించుకుంది. తన అప్ కమింగ్ ఫిల్మ్ కోసం ప్రియాంక చోప్ర ఈ విధమైన ఫీట్స్ చేస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. భారత బాక్సర్ మేరి కోమ్ జీవిత కథ ఆధారంగా నిర్మించనున్న చిత్రంలోని పాత్ర తీరు తెన్నుల్ని పరిశోధించేందుకు బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా గత కొంత కాలంగా రీసెర్చ్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ సైతం స్టార్ట్ అయింది. ప్రియాంక చోప్ర ఈ మూవీ కోసం పర్సనల్ ట్రైనర్ ని ఎంచుకుంది. 22 సంవత్సరాలు జార్ణ సంగ్వి అనే బాక్సర్ వద్ద ప్రియాంక చోప్ర బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటుంది. అంతే కాకుండా రీసెంట్ గా ఒక ఇరవై రోజుల నుండి ప్రియాంక చోప్ర తీసుకున్న ట్రైనింగ్ కి తను ఏకంగా 7 కిలోల బరువను తగ్గారు. ప్రియాంక చోప్ర ఏ విధంగా బరువును తగ్గవలసి వచ్చింది, అందుకు ఎటువంటి ట్రైనింగ్ తీసుకుందో వంటి వివరాలను మీడియాకి వివరించింది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఉమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేరి కోమ్‌ను పలుసార్లు ప్రియాంక కలిసింది. అంతే కాకుండా మేరికోమ్ నిర్వహిస్తున్న ట్రైనింగ్ క్యాంప్‌ లోనూ ప్రియాంక చోప్ర గతంలో పాల్గొని ఎన్నో మెలుకువలను నేర్చుకుంది. మొత్తానికి ప్రియాక చోప్ర చాలా సంవత్సరాల తరువాత తన బరువుని తగ్గించుకోవడంతో ఈ న్యూస్ బిటౌన్ లో హాట్ టాపిక్ గా మరింది. మేరికోమ్ మూవీ కోసం ప్రియాంక చోప్ర చేస్తున్న వర్క్ అవుట్స్ చూస్తుంటే, తను ఏ రేంజ్ లో కష్టపడిందో మూవీ రిలీజ్ తరువాత మాత్రమే తెలుస్తుంది.
 
Top