సౌత్ ఇండియన్ సెక్సీ హీరోయిన్ శృతిహాసన్ బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంత కాలం అద్దె ఇంట్లో ఉంటూ బిటౌన్ లో వరుస మూవీలు చేస్తున్న ఈ బ్యూటీ ఇక నుండి సొంత ఇంట్లో నుండే తన అప్ కమింగ్ మూవీలకు సంబంధించిన డిస్కషన్స్ అండ్ డెసిషన్స్ జరిపోనున్నాయి. మేటర్ ఏంటంటే శృతిహాసన్ ముంబై లో ఓ ఇంటికి ఓనర్ అయింది. మొన్నటి వరకూ ముంబై లోని బాంద్రా ఏరియాలో అద్దె ఇంట్లో ఉంటూ తన కార్యకలాపాలను కొనసాగించింది. గత కొంత కాలంగా వరుస మూవీలను చేసుకుంటూ, బాక్సాపీస్ ను షేక్ చేస్తున్న ఈ హీరోయిన్ కి రెమ్యునరేషన్ డబుల్ అయింది. దాంతో వరుస మూవీలను ఒప్పుకొని కోట్ల రూపాయల్లో అడ్వాన్స్డ్ మనీని తీసుకొని, ఆ డబ్బులతోనే సొంత ఇంటిని కొన్నదనే న్యూస్ బయటకు వినిపిస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. శృతిహాసన్ ముంబై లోని బాంద్రా ఏరియా నుండి అంధేరి ఏరియాలో మారిపోయింది. అంధేరిలో అంత్యంత ఖరీదైన సొంత ఇంటిని కొనుక్కుంది. తను కొత్తగాక కొనుక్కున్న ఇంటి ఖరీదు దాదాపు 60 కోట్ల రూపాయలుగా బిటౌన్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం. శృతిహాసన్ గబ్బర్ సింగ్ 2 మూవీ నుండి ఇప్పటి వరకూ సంపాదించిన మొత్తం మనీతోనూ ఈ ఇంటిని కొనుక్కున్నట్టుగా తను చెప్పుకొచ్చింది. శృతిహాసన్ ఇంటి పక్కనే రాక్ స్టార్ మూవీ దర్శకుడు ఇంతియాజ్ ఆలీ, ప్రాచీయ్ దేశాయ్ వంటి ప్రముఖులు ఉన్నారు. తన ఇంటికి సంబంధించిన ఇంటిరియర్ ను కూడ తనే దగ్గర ఉండి డిజైన్ చేయించుకుందట . మొత్తంగా శృతిహాసన్ ఫిల్మ్ కెరీర్ లాభాల్లోనే నడుస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం శృతిహాసన్ బిటౌన్ లో గబ్బర్ మూవీలోనూ, అలాగే వెల్ కం బ్యార్, యారా మూవీలతో పాటు తమిళ్ లో విశాల్ సరసన పూజై మూవీలో నటిస్తుంది.
 
Top