పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అప్ కమింగ్ మూవీలకి సంబంధించిన షూటింగ్ ని
స్పీడ్ చేస్తున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న మల్టీస్టారర్
మూవీని త్వరగా పూర్తిచేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకే గబ్బర్ సింగ్2
మూవీకి సంబంధించి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే దాని కంటే ముందుగా
వెంకటేష్ తో నటించబోతున్న మల్టీస్టారర్ మూవీను ఎప్పుడు స్టార్ట్ చేయాలి?
ఎప్పుడు పూర్తి చేయాలి? అనే విషయాలపై పవన్ పిచ్ఛ క్లారిగా ఉన్నాడు. పవన్
కళ్యాణ్ జూన్ 9న మల్టీస్టారర్ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కి
డేట్స్ ఇచ్చాడు.
దీనికి సంబంధించిన పూర్తి డిటైల్స్ ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు
అందిస్తుంది. జూన్ 9న పవన్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ షూటింగ్ స్టార్ట్
అవుతుంది. తరువాత మరో పది రోజుల వరకు రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. దీంతో ఈ
మూవీకి సంబంధించి పవన్ సీన్స్ లో దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తవుతుంది.
మరో వారం రోజుల తరువాత పవన్ పై చిత్రీకరించాల్సిన రెండు, మూడు సీన్స్ కోసం
పవన్ మరో రెండు రోజుల కాల్షీట్స్ ఇచ్చాడు. దీంతో మల్టీ స్టారర్ చిత్రంలో
పవన్ కి సంబంధించిన షూటింగ్ పూర్తవుతుంది.
ఆ తర్వాత పవన్ నటించబోతున్న గబ్బర్ సింగ్2 మూవీ కి సంబంధించిన రెగ్యులర్
షూటింగ్స్ ఎప్పుడు పెట్టుకోవాలి అన్నదానిపై, నిర్ణయించుకొని చిత్ర యూనిట్
కి చెబుతాడు. గబ్బర్ సింగ్ 2 మూవీకి దాదాపు 40 రోజుల కాల్షీట్స్ ని
ఇచ్చినట్టుగా చిత్రయూనిట్ నుండి అందిన సమాచారం. మొత్తంగా పవన్ కళ్యాణ్ మరో
రెండు నెలల్లో తన ముందు ఉన్న రెండు చిత్రాలను పూర్తి చేసి, పుల్ టైం
రాజకీయాల్లోకి దిగాలని ఆలోచిస్తున్నాడంట.