పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల అణిచి వేతకు ఇక నైజం ప్రాంతంలో ఒక మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోంది అని ఫిలింనగర్ లో కొందరు వ్యాఖ్యనిస్తున్నారు. డైరెక్ట్ గా కాకపోయినా అన్యాపదేశం గా పవన్ సినిమాలను నైజాంలో తొక్కేసేవిధంగా కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని కొందరి అభిప్రాయం. ఎపి హెరాల్డ్ కు తెలుస్తున్నవిశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్ పై కెసిఆర్ చాలా గరం గరంగా వున్నట్లు భోగట్టా. ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి, కెసిఆర్ ను, ఆయన కుటుంబ సభ్యులను డైలాగులతో చీల్చి చెండాడేసిన విషయాన్ని కెసిఆర్ మరిచిపోలేదని అంటున్నారు. దీనికి కారణం కొద్ది రాజుల క్రితం కెసిఆర్ తనకు అభినందనలు చెప్పడానికి కలిసిన తెలంగాణా ప్రాంతనికి చెందిన కొంతమంది సినిమా ప్రముఖులతో కెసిఆర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో తనను తన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ పవన్ అనేక బహిరంగ సమావేశాలలో ఓపెన్ కామెంట్స్ చేస్తూ ఉంటే సినిమా పరిశ్రమకు చెందిన తెలంగాణ వ్యక్తులు ఎవరూ ఎందుకు పవన్ కామెంట్స్ ను ఖండించలేదు అంటూ కెసిఆర్ తీవ్ర అసహనాన్ని వ్యక్త పరిచినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే గతంలో పవన్ ‘కొమరం పులి’, ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ సినిమాలకు వచ్చినట్లుగా ఏదోఒక సమస్యతో పాటు భవిష్యత్తులో తెలంగాణ ప్రాంతంలో ధీయేటర్ల సమస్య వచ్చినా ఆశ్చర్య పడనక్కరలేదని అంటున్నారు. ఇలాంటి పరిస్థుతులలో కెసిఆర్ ను ప్రసన్నం చేసుకోవడానికి పవన్ ప్రయత్నాలు ప్రారంభిస్తాడా లేకుంటే మరో ఆరు నెలలో రాబోతున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కెసిఆర్ పై తన మాటల యుద్దాన్ని మరింత పెంచి ఇప్పటికే నైజాం ప్రాంతంలో సమస్యలలో పడ్డ తన కెరియర్ ను కూడ పట్టించుకోకుండా తన వ్యవహార శైలిని కొనసాగిస్తాడా అనే విషం పై రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 
Top