భాగ్యనగరంలో నిన్న జరిగిన ఐడియా కంపెనీకి సంబంధించిన ఒక అవార్డ్స్ ఫంక్షన్ లో అతిధిగా వచ్చిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ తనకు పులులూ, సింహాలు అంటే ఎటువంటి చిన్న చూపు లేదనీ అంటూ తన సహజ సిద్ధమైన స్మైల్ తో ‘ఆగడు’ టీజర్ రగడకు ముగింపు పలికాడు. అంతేకాదు తనకు సినిమా రంగంలోని ప్రతివ్యక్తి పైనా చాల గౌరవం ఉంది అంటూ టాప్ హీరోల అభిమానులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇక నేరుగా మహేష్ బాబు ఈ విషయం పై స్పందించాడు కాబట్టి ఈ వ్యవహారం ఇంతటితో ముగిసి పోతుంది అని అనుకోవాలి. ఇదే సందర్బంలో మాట్లాడుతూ తాను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా కమిట్ అయినట్లు మహేష్ వెల్లడించాడు. అదేవిధంగా కొరటాల శివతో కూడ సినిమా ఉంటుందని అధికారికంగా చెప్పాడు. ఇది ఇలా ఉండగా మహేష్ మరో కొత్త విషయం వెల్లడించాడు.  మణిరత్నం ప్రాజెక్టు ఎందుకు ఆగిందో తనకుతెలియదని, మణి ఫోన్ చేసి ఆగిందని చెప్పారంతే అని తెలివిగా మాట దాటేసాడు మహేష్. ‘ఆగడు’ టీజర్ రగడ మహేష్ బహిరంగoగా స్పందించడంతో చల్లారుతుందని భావించాలి. ఏమైనా టాలీవుడ్ ప్రిన్స్ తెలివిగా వ్యవహరించాడు అనుకోవాలి. 
 
Top