గతంలో కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిన శింబు, నయనతారల గొడవ మళ్ళీ కోలీవుడ్ లో రచ్ఛగా మారింది. ఏ కారణంగా అయితే నయనతారకు శింబు దూరమయ్యాడో, మళ్లీ అదే గొడవతో వీరిద్దరూ మరోసారి హాట్ టాపిక్ గా మారనున్నారు. ఒకప్పుడు గాఢమైన ప్రేమలో మునిగిన నయన్-శింబు ల జోడీ, ప్రభుదేవా ఎంట్రితో బ్రేక్ అయింది. తర్వాత ప్రభుదేవా వ్యవహారం రివర్స్ కావడంతో తిరిగి శింబు లైన్లోకి వచ్చాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతుంది. వీరిద్దరిమధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తోందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. గతంలో నయన్-శింబు లిప్‌లాక్ సీన్లు పెట్టుకున్న ఫోటోలు శింబు ఇంటర్నెట్లో పెట్టాడు. శింబుతో రొమాన్స్ చేయటానికి నయనతార ఒప్పుకున్నప్పటికీ, వాటిని ఇంటర్నెట్లో పెట్టడం అనేది తనకి కోపం తెప్పించింది. అందుకే శింబుపై ఫైర్ అయింది. ఇపుడు తాజాగా శింబు నయనతార సన్నిహితంగా ఉన్న ఫోటోలు తన ఫెస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరూ ''ఇదు నమ్మ ఆళు'' అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా వీరిద్దరు సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. అంతే కాకుండా వీరిద్దరి మధ్య మళ్ళీ ఎఫైర్ నడుస్తుందనేది కోలీవుడ్ ఓపెన్ టాక్. తాజాగా శింబు నయన్‌తో దిగిన ఫోటోలను తన సెల్‌ఫోన్‌‌లో పెట్టుకొని, ఆ తర్వాత ఇంటర్నెట్‌లో పెట్టినట్లు కోలీవుడ్ చెబుతుంది. శింబుతో ఎవరు రొమాన్స్ చేసినా ఇదే పరిస్థితి. ఆ హీరోయిన్స్ ఫొటోలను, మాటలను ఇంటర్నెట్ లో పెట్టడం శింబుకి అలావాటుగా మారింది. ప్రస్తుతం నతయతార ఫొటోలను నెట్ లో పెట్టిన శింబుపై , నయన ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి. ఎప్పటిలాగే సీరియస్ అవుతుందో, లేక శింబుతో కంటిన్యూ అవుతుందో అని కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.
 
Top