పూనమ్ పాండే నటించిన డెబ్యూ ఫిల్మ్ నషా మూవీ బిటౌన్ లో సక్సెస్ సాధించలేక పోయినప్పటికీ, క్రేజ్ ను మాత్రం సొంతం చేసుకుంది. నషా మూవీ రిలీజ్ కి మందు తను ఏకంగా నాలుగు మూవీలలో నటించటానికి దాదాపు రెండు కోట్ల రూపాయల అడ్వాన్స్ మనీ ని నిర్మాతల వద్ద నుండి తీసుకుంది. అయితే మూవీ రిలీజ్ తరువాత వచ్చిన రివర్స్ రిజల్డ్ కి పూనమ్ పాండే ఆ అవకాశాలను కోల్పోవలసి వచ్చింది. ఇదిలా ఉంటే నషా మూవీ నిర్మాతలు మాత్రం ఇవేమి పట్టనట్టుగా పూనమ్ పాండే తో నషా మూవీ సీక్వెల్ ని తీయటానికి రెడీ అయిపోయారు. అలాగే రాగిణి ఎం.ఎం.యస్-3లోనూ పూనమ్ పాండే ని మెయిన్ రోల్ కి తీసుకున్నారు. రాగిణి ఎం.ఎం.యస్-2 గ్రాండ్ సక్సెస్ సాధించడంతో ఈ మూవీకి ధర్డ్ పార్ట్ ని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇందులో నటిస్తున్నందుకు పూనమ్ పాండేకి దాదాపు ఎనభై లక్షల రూపాయల రెమ్యునరేషన్ ని ఇస్తున్నట్టుగా బిటౌన్ వర్గాల నుండి అందిన సమచారం. అందుకు సంబంధించిన అగ్రిమెంట్స్ కూడ పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం నిర్మాత ఏక్తా కపూర్, పూనమ్ పాండే కి మరికొన్ని షరతులను విధించింది. అందుకు పూనమ్ ఓకె చెప్పినప్పటికీ తనకు రెమ్యునేరేషన్ ని పెంచాలంటూ చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వివరాలను తను మీడియాకి చెప్పుకొచ్చింది. నా రెమ్యునరేషన్ బిగ్ ఫిగర్ కి చేరుకున్నందుకు హ్యాపీగా ఉంది. సిల్వర్ స్క్రీన్ లో ఇంతకాలానికి నేను అనుకున్న పొజిషన్ కి చేరుకున్నాను అని అంది. పూనమ్ మాటల వెనుక ఉన్న అర్ధం ఏంటంటే తను రాగిణి ఎం.ఎం.యస్-3 మూవీకి దాదాపు కోటి రూపాయల రెమ్యునరేషన్ ని తీసుకున్నట్టుగా చెబుతుందని బిటౌన్ మీడియా అంటుంది.
 
Top