నిన్న రాత్రి తిరుపతిలో తెలుగుదేశం పార్టీ శాసనసభ నాయకుడిగా చంద్రబాబును
ఎంపిక చేసే కార్యక్రమానికి వచ్చిన బాలకృష్ణ హిందూపురం ఎమ్.ఎల్.ఎ గా కొత్త
పదవిలో కనిపిస్తూ వేదిక పై హడావిడి చేసాడు. అంతేకాదు తన బావ చంద్రబాబుకు
తలనొప్పి లేకుండా తనకు మంత్రిపదవి వద్దు అంటూ సంకేతాలు ఇచ్చి తెలుగుదేశం
పార్టీలో మరో పవర్ సెంటర్ ఏర్పడకుండా బాలకృష్ణ వ్యూహాత్మకంగా వ్యవహరించి
చంద్రబాబుకు జోష్ ను కలిగించాడు.
దీనితో బాలయ్య జూన్ 8వ తేదీన కొత్తగా కొలువు దీరబోతున్న కేబినెట్‌లో
బాలయ్యకు చంద్రబాబు మంత్రిపదవి ఇస్తానన్నా ముందు తన నియోజకవర్గం అభివృద్ధి
తర్వాతే పదవులని అంటు తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యుల ఆధిపత్య పోరుకు
కళ్ళెం వేసాడు.
బాలకృష్ణకు మంత్రిపదవి ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా ఉన్నా ముందు తనను
గెలిపించిన హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మంచి శాసనసభ్యునిగా
నిరూపించుకున్న తరువాతే ఏ పదవులైనా అంటూ వచ్చిన ఆఫర్‌ని బాలకృష్ణ
తిరస్కరించాడు అనే వార్తలు వస్తున్నాయి.
దీనికి తోడు తాను మంత్రి పదవి తీసుకుంటే ఇప్పటికే చాల దూరం జరిగి పోయిన
హరికృష్ణ, బాలకృష్ణల మధ్య దూరం మరింత పెరిగి పోతుంది అన్న వ్యూహాత్మక
ఎత్తుగడతో తన నందమూరి కుటుంబాన్ని కూడ దృష్టిలో పెట్టుకుని బాలయ్య ఈ
నిర్ణయం తీసుకున్నాడు అని అంటున్నారు. ఎదిఎమైనా బాలయ్య నిర్ణయం నందమూరి
కుటుంబంలోని కోల్డ్ వార్ ను కొంత వరకు తగ్గిస్తుంది అని అనుకోవాలి.