టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ అనే పేరు కేవలం ఒక్కరికే
వర్తిస్తుంది. అదే చిరంజీవి. చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రి ఇచ్చిన తరువాత ఆ
పేరును ఫుల్ ఫిల్ చేయటానికి చాలామంది హీరోలు చాలా రకాలుగా
ప్రయత్నిస్తున్నప్పటికీ, అది సాధ్యపడలేదనే చెప్పాలి. తాజాగా చిరంజీవి
పొలిటికల్ కెరీర్ ఆశించినంత ఆశాజనకంగా లేకపోవడం తిరిగి యు టర్స్ తీసుకొని
మూవీలలో యాక్ట్ చేయడం కోసం కథలు వింటున్నట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి.
అయితే మెగాస్టార్ ముందు ఉన్న కొత్త టాస్క్ తన 150వ చిత్రం.
తన 150వ చిత్రానికి డైరెక్టర్ వినాయక్ కి దర్శకత్వ బాధ్యతలను అప్పగించాలని
చిరంజీవి ఆలోచిస్తున్నాడు. వినాయక్ సైతం చిరంజీవి కోసం పవర్ ఫుల్ కథని రెడీ
చేసి ఉంచాడు. ఇప్పటికే ఆ కథని చిరంజీవికి చెప్పగా, అందుకు చిరంజీవి కొద్ది
మార్పులు చెప్పి మళ్ళీ డెవలెప్ చేయమాన్నాడు. ప్రస్తుతం వినాయక్ చిరంజీవి
కథను డెవలెప్ చేస్తూ, అలాగే బెల్లంకొండ సురేష్ తనయుడి మూవీని
తెరకెక్కిస్తున్నాడు.
ఇదిలా ఉంటే చిరంజీవిని తమ కథలతో మెప్పించడానికి కొందరు దర్శకులు ప్రయత్నాలు
చేస్తున్నారు. ఆ లిస్ట్ లో ఇటీవల ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఓ
కథ వినిపించాడట. అయితే బోయపాటి చెప్పిన కథను కొద్ది మార్పులతో డెవలెప్
చేయమని చెప్పాడు. సీన్ కట్ చేస్తే బోయపాటి కథ చిరంజీవికి నచ్ఛలేదనే టాక్
వినిపిస్తుంది. బోయపాటికి నో అని చెప్పలేక, కథలో మార్పులు చేయమన్నట్టుగా
చిరంజీవి భావించాడని, మెగా క్యాంపు నుండి అందిన సమాచారం.
ఈన్యూస్ కాస్త బోయపాటి ఎవరో చెప్పారు. దీంతో బోయపాటి, చిరంజీవి మూవీపై
ఆశలను వదిలేసుకొని, మరో హీరో కోసం ప్రయత్నిస్తున్నట్టు టాలీవుడ్ సమాచారం.
ఫైనల్ గా చిరంజీవి 150వ సినిమాకి వినాయక్ డైరెక్టర్ గా కన్ ఫర్మ్ అని
అంటున్నారు.