జూనియర్ ఎన్టీఆర్ సంవత్సరం ప్రారంభం అయిపోయి ఆరు నెలలు గడిచి పోతున్నా ఇప్పటి వరకు తన ఒక్క సినిమా కూడ విడుదల చేసుకోలేక పోయాడు. జూనియర్ ప్రస్తుతం నటిస్తున ఒకేఒక్క సినిమా ‘రభస’ ఇప్పటికే రకరకాల కారణాలతో విడుదల ఆలస్యమై ఎట్టకేలకు ఆగస్టు 14న ఈ సినిమాను విడుదల చేద్దామని యంగ్ టైగర్ పట్టుదల మీద ఉన్నాడు. సరైన హిట్ చూసి సంవత్సరం దాటి పోవడంతో రభస పై చాల పెద్ద ఆశలే పెట్టుకున్నాడు జూనియర్. అయితే ఇప్పుడు తన ఆశలకు తనతో ‘రభస’ సినిమాలో నటిస్తున్న సమంత తన సినిమాకు పోటీగా మరో హీరో సినిమాను తీసుకు రావడం జూనియర్ ను ఖంగారు పెడుతోంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ సినిమాలో కూడ సమంత హీరోయిన్ గా ఉండటం జూనియర్ కు మరింత టెన్షన్ పెడుతోంది. ఇక వివరాలలోకి వెళితే తమిళ స్టార్ హీరో సూర్య, సమంత నటించిన తమిళ సినిమా ‘అంజాన్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ‘రభస’ సినిమా విడుదల తేదీనే టార్గెట్ గా చేసుకుని ఆగస్టు 14న కోలీవుడ్ , టాలీవుడ్ లలో ఒకేసారి విడుదల కాబోతోంది.  ఇప్పటికే ‘అoజాన్’ సినిమా పై పాజిటివ్ టాక్ కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో రావడమే కాకుండా మొట్టమొదటిసారి సమంత ఈ సినిమాకు చేసిన స్కిన్ షో ఈసినిమా క్రేజ్ ను మరింత పెంచుతోంది. ఒక వైపు టాప్ హీరో సూర్య ఇమేజ్ మరో వైపు సమంత అందాల ఆరబోత అంజాన్ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారితే తాను పెద్ద ఆసలు పెట్టుకున్న ‘రభస’ కు సమంత గండి కొడుతోంది అని జూనియర్ బెంగ పెట్టుకున్నాడు అంటూ ఫిలింనగర్ లో సెటైర్లు పడుతున్నాయి.  
 
Top