టాలీవుడ్‌లో ఇప్పుడు లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఎవరు అంటే ఎవరైనాసరే వెంటనే సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ పేరు వెంటనే చెప్పేస్తారు.‘బృందావనం’, ‘మిరపకాయ్’,లాంటి హిట్స్ తరువాత ‘దూకుడు’ సినిమా తో తమన్ టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్టు లో చేరిపోయాడు . అక్కినేని నాగేశ్వరరావు లాంటి మహా నటుడికి బ్రేక్ ఇచ్చిన ఘంటసాల బలరామయ్య మనవడుగా తమన్ తన సినిమా వారసత్వ్యాన్ని కొనసాగిస్తూ అతితక్కువకాలంలో టాలీవుడ్ లో 50 సినిమాలకు సంగీత దర్శకత్యం వహించే స్థాయికి ఎదిగాడు తమన్ . ఇది అంతా ఒక వైపు కధ.అయితే నాణేనికి రెండోవైపు కధ కుడా తమన్ విషయం లో వినిపిస్తోంది . తమన్ స్వర పరుస్తున్న పాటలు అన్నీ ఒకే లా ఉంటున్నాయని అనే టాక్ కుడా వినిపిస్తోంది. ఈ మాటలు స్వయంగా దాసరి రవితేజ ‘బలుపు’ ఆడియో వేడుకలో అనడం అప్పట్లో సంచలనం గా మారింది . ఇక లేటెస్ట్ గా తమన్ ఇతర సంగీత దర్శకుల ట్యూన్స్ కాపీ కోడుతున్నాడు అనే విమర్శలు వస్తున్నాయి ‘రేసుగుర్రం’ మూవీకి తమన్ అందించిన సంగీతం బిగ్‌హిట్ అయింది. ఇతని కెరీర్‌లోనే ఇది హైలైట్‌గా నిలిచింది. కానీ.. ఈ చిత్రంలోని పాపులర్ సాంగ్స్‌లో ఒకటైన ‘స్వీటీ’కి తమన్ ఇచ్చిన ట్యూన్.. రుమేనియా పాట ‘మెటియో’ నుంచి కాపీ కొట్టాడట. ఈ వార్తను ఇప్పుడు ప్రతి సంగీత దర్శకుడు తమన్ ను టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది అంతా తమన్ అనుకోకుండా కాకతాళీయంగా చేస్తున్నాడా లేక కావాలని చేస్తున్నాడా అనే విషయం పై రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఏమైనా తమన్ కాపీ వ్యవహారం అడ్డం గా దొరికి పోయింది అని అనుకోవాలి. 
 
Top