పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని, మహేష్ బాబు భీట్ చేశాడు. తాజాగా గూగుల్ నిర్వహించిన సర్వేలో మహేష్ బాబు నెంబర్ హీరోగా మారాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. మహేష్ బాబు నటించిన వన్ మూవీ వరల్డ్ లెవల్లో రికార్డ్స్ క్రియోట్ చేయటంతో, టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఈ ప్రిన్స్ పై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్పెషల్ ఫోకస్ చేసింది. ఆనాటి నుండి నేటి వరకూ మహేష్ బాబు నటిస్తున్న మూవీలపై ఇండియన్ సినీ ఆడియన్స్ తెగ ఆసక్తి చూపుతున్నారు. ఆ విధంగానే మహేష్ బాబు నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ ఆగడు మూవీకి సంబంధించని న్యూస్ ను నెటిజెన్స్ ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేశారు. 2014లో రిలీజ్ కాబోతున్న అప్ కమింగ్ మూవీలలో ఏ మూవీను ఎవరు ఎక్కువ సార్లు సెర్చ్ చేశారో అన్న దానిపై గూగుల్ ఓ సర్వే చేసింది. గూగుల్ రిలీజ్ తాజా సర్వే ప్రకారం ఆగడు నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. ఇండియా మొత్తంలో ఆగడు మూవీ 5 వ స్థానంలో ఉండటంతో బిటౌన్ సైతం మహేష్ బాబు స్టార్ డం పై మరోసారి ద్రుష్టి పెట్టింది. ఈ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ కి స్థానం దక్క పోవడం పవన్ గబ్బర్ సింగ్ 2 మూవీ పై సినీ ప్రేక్షకులు అంత ఆసక్తిని చూపిచడం లేదేమో అని టాలీవుడ్ అంటుంది. గూగుల్ రిలీజ్ చేసిన ఆ లిస్ట్ ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది.

2014లో రిలీజ్ కాబోతున్న అప్ కమింగ్ చిత్రాల నెటిజన్స్ సెర్చ్ రిపోర్ట్:
1. హ్యాపీ న్యూ ఇయర్ ( షారుఖ్ ఖాన్)
2. కిక్ (సల్మాన్ ఖాన్)
3. కత్తి (విజయ్)
4. బాంగ్ బాంగ్ (హ్రుతిక్ రోషన్)
5. ఆగడు (మహేష్ బాబు) 
 
Top