బాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ దీపిక పదుకునే ఒకే ఒక్క పాట కోసం వచ్చిన
నాలుగు కోట్ల రూపాయలను చిత్తు కాగితాలలా వదిలేసుకోవడం బాలీవుడ్ మీడియాకు
హాట్ టాపిక్ గా మారింది. ఇక వివరాలలోకి వెళ్ళితే ఈ మధ్య ముంబై లోని బాగా
బలిసిన ఒక ఎన్నారై ల ఫ్యామిలీ తమ ఇంట్లో జరుగుతున్న వెడ్డింగ్ పార్టీలో
దీపిక చేత రామ్ లీలా పాటకి డాన్స్ చేయించాలని ఆశపడిందట.
ఈ విషయ మై ఏదో విధంగా ఆ పార్టీ ఆఫర్ తిరగ గొట్టాలనే ఉద్దేశంతో ఆ పార్టీ లో
డాన్స్ చేయడానికి నాలుగు కోట్లు జోక్ గా డిమాండ్ చేసిందట. అయితే ఆ మాటలు
నిజం అనుకుని దీపిక ఆ పెళ్లి పార్టీ వారు ఆక్షరాలా నాలుగు కోట్ల చెక్ లెటర్
తో పంపడంతో షాక్ అయిందట దీపిక.
దీనితో ఈ వ్యవహారం లోంచి ఎలా తప్పిoచుకోవలో తెలియక పెళ్లిళ్లలో, ప్రైవేట్
పార్టీలలో డాన్స్ చేయరాదనే తన నియమం గురించి వారికి చెప్పి ఒప్పించడానికి
దీపిక నానా పాట్లు పడిందట. దీపిక తమ ఫంక్షన్ లో డాన్స్ చేస్తుంది అని
అనుకుని ఏకంగా ఆ పెళ్లివారు దీపిక డాన్స్ కోసం ఓ సెట్ కూడా రెడీ
చేయించారట అయితే దీపిక నాలుగు కోట్లు కూడ తిరస్కరించేసరికి చాలా
డిజప్పాయింట్ అయిన ఆ పెళ్లివారు ఇప్పుడు మరో హీరోయిన్ కోసం వేట మొదలు
పెట్టారని అని టాక్.