సూపర్ స్టార్ రజనీకాంత్ నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ లింగ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ప్రస్తుతం రజనీకాంత్ లింగ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవికి సంబంధించిన బిజినెస్ అప్పుడే కోట్ల రూపాయలలో జరుగుతుంది. రజని చిత్రం ప్రారంభం అయిన దగ్గర నుండి ఆ మూవీ బిజినెస్ కి పలు డిస్ట్రి బ్యూటర్లు తెగ ఆసక్తి చూపుతున్నారు.తాజా సమాచారం ప్రకారం ‘లింగా’ నిర్మాతలను తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం టాలీవుడ్ కి చెందిన ఓ సంస్థ కలిసింది. దాదాపు 35 కోట్ల విలువైన డీల్ ఇద్దరి మధ్య జరిగిందని అంటున్నారు. ఒక డబ్బింగ్ చిత్రానికి ఇంత భారీ మొత్తం అనేది చాలా అసాధారణమైన విషయం. ఇంకా ఈ డీల్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. రజనీకాంత్ మూవికి ఈ రేంజ్ లో బిజినెస్ జరగటం అనేది టాలీవుడ్ లో ఇదే మొదటి సారి. గతంలో రజనీకాంత్ నటించిన మూవీలకు, మూవీ షూటింగ్ అనంతరం బిజినెస్ జరిగేది. కాని ఇప్పుడు మాత్రం తెలుగులో డబ్బింగ్ హక్కుల కోసం నిర్మాతలు ఎక్కువ సంఖ్యలో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ‘లింగా’ చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఒక భారీ షెడ్యూల్ ని జరుపుకుంటుంది. ఈ మూవీలో హీరోయిన్ గా అనుష్క, అలాగే బిటౌన్ క్రేజీ హీరోయిన్ సోనాక్షి సిన్హాలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అనుష్క ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే లింగా మూవీ తరువాత అనుష్క మరో రెండు సంవత్సరాల పాటు కోలీవుడ్ లో ఫుల్ బిజిగా మారిపోనుంది. మొత్తానికి లింగ మూవీ తెలుగు డబ్బింగ్ హక్కులను ఎవరు తీసుకుంటారనేది ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తిక విషయం.
 
Top