టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో సారి వ్యభిచార గుట్టు రట్టయింది. దీనికి సంబంధించిన ప్రత్యేక సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. గతంలో హైదరాబాద్ లో పట్టుబడిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ వ్యభిచార తతంగం మరచిపోక ముందే కన్నడ ఇండస్ట్రీకి చెందిన మరో నటి హైదరాబాద్ రైడింగ్ లో దొరికిపోయి సంచలనంగా మారింది. ప్రతి నెల ఇలా ఎవరో ఒకరు రైడింగ్ లో దొరికిపోతూ, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పరువును బజారులో పెడుతున్నారు. టాలీవుడ్ ఫిల్మ్ లో నిహారిక అనే జూనియర్ ఆర్టిస్ట్ ని ఎల్బీ నగర్ పోలీసులు వ్యభిచార కేసులో అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతోనే ఈ రైడింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. రైడింగ్ జరిగిన ప్రాంతంలోని పలు ఇళ్ళపై దాడి చేసి నిహారికతో పాటు మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అరెస్ట్ అయిన వారీలో కొంత మంది ప్రముఖులు ఉనట్టు సమాచారం. పోలీసులు మాత్రం దీనికి సంబందించిన వివరాలను బయటకు వివరించటం లేదు. టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు నిహారిక ను చాలా అవసరాలకు ఉపయోగించుకున్నట్టుగా తెలుస్తుంది. నిహారికాని పోలీసులు విచారిస్తే, చాలా విషయాలు బయటపడతాయని టాలీవుడ్ బావిస్తుంది. సరైన అవకాశాలు లేక, ఆర్ధిక పరిస్థితులు సరిగ్గా లేని కారణంగా జూనియర్ ఆర్టిస్ట్ లు ఈజీ మనీ కోసం ఇలాంటి కార్యక్రమాలకు పాలుపడుతున్నారు. ఇకనైన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ లకి సరైన అవకాశాలను కల్పించాలని, అందుకు మా సంస్థ తోడ్పాడాలని, ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది కోరుకుంటున్నారు. మొత్తానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న చీకటి కోణాలపై పోలీసుల నిఘా ఉందనేది, నేటి సంఘటనతో మరోసారి రుజువైంది.
 
Top