“ భీమవరం బుల్లోడు” సినిమా విజయం తరువాత సునీల్ చేయబోయే సినిమా పై రకరకాల
వార్తలు రావడమే కాకుండా అనేకమంది దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. అయితే
అందరికి షాక్ ఇస్తూ సునీల్ మారుతి చెప్పిన కధకు పచ్చ జెండా ఊపడమే కాకుండా ఈ
సినిమాను జూన్ నెలలో ప్రారంభిo చడానికి రెడీ అవ్వడం ఇప్పుడు టాలీవుడ్ హాట్
టాపిక్ గా మారింది.
చిన్న సినిమాలకు తన బూతు ఇమేజ్ ని జోడించి ఒక్కో మెట్టూ ఎక్కుతూ
పైకొచ్చాడు మారుతి. ఇప్పుడు తన రేంజ్ మార్చుకోవడానికి నానా పాట్లు
పడుతున్నాడు. డైరెక్టర్ గా వెంకటేష్ తో సినిమా తీసి టాప్ దర్శకుల
జాబితాలో చేరదామనుకొన్నాడు మారుతి కానీ ‘రాధ’ సినిమా ఒక్కసీన్ కూడా
తీయకుండానే ఆగిపోయింది.
ఈ మధ్యలో కొత్త జంటతో తన క్లీన్ ఇమేజ్ ని చాటుదామని ప్రయత్నించినా ఆ
ప్రయోగం కుడా బెడిసి కొట్టింది. ఇక చేసేది లేక ఇప్పడు ఇలా సునీల్ తో
సరిపెట్టుకుంటున్నాడు అనుకోవాలి. ఈ సినిమాను డి.వి.వి. దానయ్య
నిర్మిస్తున్నట్లు గా తెలుస్తోంది. ప్రస్తుతం హాస్య సినిమాలకు చిరునామా గా
ఉన్న సునీల్ బూతు ఇమేజ్ తో ఉన్న మారుతీ వలలో ఎలా పడ్డాడు అనే విషయం హాట్
టాపిక్ గా మారింది.
తనికెళ్ల భరణి దర్శకత్వంలో కన్నప్ప కథకి ఓకే చెప్పినా అది ఇంకా
స్ర్కిప్టు దశలోనే ఉండటంతో సునీల్ ఈలోగా మారుతి సినిమా ట్రాక్
ఎక్కిస్తున్నాడు అని అంటున్నారు. ఏదిఏమైనా సునీల్ మరో పెద్ద సాహసమే
చేస్తున్నాడు అనుకోవాలి.