రుద్రమదేవి మూవీలో మెగా హీరో అల్లు అర్జున్ నటిస్తున్నాడు. దీనికి సంబంధించి అఫిషియల్ మేటర్ ని దర్శకుడు గుణశేఖర్ మీడియాకి వివరించాడు. దానిని యథాతథంగా ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. " రుద్రమదేవి లాంటి చారిత్రాత్మక సినిమాలు తీయాలంటే.. హై టెక్నికల్ వేల్యూస్ కన్నా... ముందుగా మంచి ఆర్టిస్టులు కావాలి. ఈ ప్రాజెక్ట్ చేసుకున్న అదృష్టం కద్దీ... అనుష్క, కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్, సుమన్, ఆదిత్యమీనన్, జయప్రకాష్ రెడ్డి, కేథరిన్... లాంటి హేమాహేమీలయిన ఆర్టిస్టులు దొరికారు. అలాగే ఈ సినిమాలో అత్యకంత కీలకమైన మరో పాత్ర వుందన్న విషయం మీ అందరికి తెలిసిందే. కాకతీయుల చరిత్రలో రుద్రమదేవితో పాటు చిరస్థాయిగా జనం గుండెల్లో నిలిచిపోయిన ఆ పాత్రే.. గోనగన్నారెడ్డి. అప్పట్లో వర్ధమానపురంగా పిలవబడిన నేటి మహబూబ్ నగర్ జిల్లా వడ్డెమాన్ కి చెందిన ఈ వీరుడి గాధ చాలా ఆసక్తికరం. ఓ బందిపోటుగా, రాబిన్ హుడ్ తరహాలో జనం కోసం రుద్రమదేవితోనే పోటాపోటీగా తలపడ్డ పాత్ర. ఇంతటి పాధాన్యత కలిగిన ఈ పాత్రకి ఎవరిని ఎంచుకోవాలా అని తర్జన భర్జనలు పడ్డాను. ధైర్యసాహాసాలతోపాటు, ఎలాంటి సమస్యని అయినా, ఈజీ గోయింగ్ గా ఫేస్ చేసే ఓ యూత్ ఫుల్ వారియర్ క్యారెక్టర్ అది. స్పెషల్ అప్పియరెన్స్ అయినా... సినిమా చూశాక...రుద్రమదేవితో పాటు వెంటాడే అద్బుతమైన ఆర్టిస్ట్, యూత్ ఐకాన్... ఈ పాత్ర చేయడానికి ముందుకొచ్చారు. తను మరోవరో కాదు బాక్సాపీస్ బరిలో రేసుగుర్రంలా దూసుకుపోతున్న అల్లుఅర్జున్" ఈ తరహా మాటలతో దర్శకుడు గుణ శేఖర్, అల్లు అర్జున్ రుద్రమదేవి మూవీలో నటిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే త్వరలోనే అల్లుఅర్జున్ కి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ స్టార్ కాబోతుందని చిత్ర యూనిట్ సైతం అంటుంది. మొత్తానికి అల్లుఅర్జున్ మొదటి సారిగా చారిత్రాత్మక మూవీలలో నటించడం జరగుతుంది.
 
Top