టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న అప్ కమింగ్ ఫిల్మ్ "నీజతగా నేనుండాలి". ఈ మూవీ టైటిల్ పాతగా ఉన్నప్పటికీ ఈ మూవీ బ్యాక్ గ్రౌండ్ ని తెలుసుకుంటే కచ్ఛితంగా ఈ మూవీపై మనకు గుడ్ పీలింగ్ కలగటం ఖాయం. ఎందుకంటే ఈ మూవీ బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన ఆషికి2 మూవీకి ఇది రిమేక్ గా తెలుగులో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని బయటకి రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన న్యూస్ ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ఆషికి2 మూవీ బిటౌన్ లో గ్రాండ్ సక్సెస్ సాధించినప్పటికీ తెలుగులో ఈ రిమేక్ మూవీ ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో కొద్దిగా అనుమానంగానే ఉందంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ రిమేక్ మూవీ ఫస్ట్ లుక్ సైతం, ఆషికి2 మూవీ పోస్టర్ ను యాజ్ టీజ్ గా కాపీ కొట్టారు. తెలుగులో నిర్మిస్తున్నారు కాబట్టి ప్రమోషన్స్ ను అయినా తెలుగు ఆడియన్స్ కి తగ్గట్టుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయటం లేదు చిత్రయూనిట్ . అంతే కాకుండా మూవీను సైతం ఉన్నది ఉన్నట్టుగా రిమేక్ చేస్తే తెలుగు లోఈ మూవీకు ఆధరణ తక్కువగా ఉంటుందని కచ్ఛితంగా చెప్పవచ్చు. ఆషికి2 మూవీకి ప్రాణం పాటలు. కాని "నీజతగా నేనుండాలి" అనే మూవీలో పాటలు కొత్తవి తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. కాని చిత్ర యూనిట్ మాత్రం ఈ మూవీలో ని పాటులను ఆషికి2 మూవీ పాటలకి డబ్బింగ్ పాటలుగానే తెరకెక్కిస్తున్నారని టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్. మొత్తానికి "నీ జతగా నేనుండాలి" మూవీ అనేది ఏంత మేరకు సక్సెస్ సాధిస్తుందో రిలీజ్ అయితే కాని తెలియదు.
 
Top