పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఫుల్ టార్గెట్ చేశాడు టాలీవుడ్ స్టార్ హీరో. మహేష్ బాబు రిలీజ్ చేసిన ఆగడు మూవీ ఫస్ట్ లుక్ టీజర్ లో, ప్రిన్స్ చెప్పిన డైలాగులు టాలీవుడ్ లో పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. ముఖ్యంగా మహేష్ డైలాగులు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయి ఒక్క పవన్ అభిమానులు మాత్రమే కాకుండా మహేష్ అభిమానులు సైతం అవుననే అంటున్నారు. టాలీవుడ్ లో వినిపిస్తున్న దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ఎంతో కాలం నుండి వేచి చూసిన ప్రిన్స్ అభిమానులు, ఇప్పుడు ఆగడు మూవీ టీజర్ ని చూసి పండగ చేసుకుంటున్నారు. గతంలో మాదిరిగా మహేష్ బాబు తన అప్ మూవీల టీజర్ ను కేవలం మ్యూజిక్ తోనే వదిలి పెట్టకుండా ఇప్పుడు డైలాగులతో ముందుకు తీసుకు వచ్చాడు. ఇందులోని డైలాగులను చూసుకుంటే "సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెల్దుగానీ పంచ్ డైలాగుల ప్రభావం బాగా ఉందీ.. పులులు,సింహాలు,ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపేరిజన్స్ తో ఎలపరమొచ్చేత్తోంది. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలూ వా టు డూ వాట్ నాట్ టు డూ" అంటూ ప్రిన్స్ విసిరిన ఈ డైలాగులు పవన్అభిమానులను నిద్రపోనివ్వటం లేదంట. మహేష్ బాబు, తన మూవీలతో పవన్ కి సెటైర్ వేసే సీన్ ఉండదు. ఎందుకంటే వీరిద్దరూ మంచి స్నేహితులుగానే ఎప్పుడూ ఉంటారు. అయితే ఈ మూవీను డైరెక్ట్ చేసేది శ్రీనువైట్ల కావడంతో , మూవీలోని డైలాగులతోనూ, క్యారెక్టర్ రోల్స్ తోనూ మూవీని కాంట్రవర్సీగా శ్రీనువైట్ల చేయగలడు. ప్రిన్స్ చేత ఇటువంటి డైలాగులను చెప్పించి, మూవీపై హైప్ క్రియేట్ చేయాలనేది శ్రీనువైట్ల ప్లానింగ్ అని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా మహేష్ బాబు డైలాగులకు మళ్ళీ పవన్ పంచ్ ఇస్తాడో లేదో చూడాలి మరి.
 
Top